శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 5 నవంబరు 2018 (09:08 IST)

పంజాబ్ పాటకు నెటిజన్ల ఫిదా... 'లోంగ్ లాచీ'కి 46 కోట్ల వ్యూస్...

ఇటీవలి కాలంలో సినీ ఇండస్ట్రీ సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఒక సినిమాను బిగ్ స్క్రీన్‌పై కంటే.. స్మాల్ స్క్రీన్(యూట్యూబ్)లోనే అత్యధిక మంది వీక్షిస్తున్నారు. అలా ఓ పంజాబీ చిత్రంలోని పాటను ఏకంగా 46 కోట్ల మంది వీక్షించారు. సోషల్ మీడియాలో అత్యధిక వీక్షకులు పొందిన పాట ఇదే కావడం గమనార్హం. 
 
తాజా సమాచారం మేరకు పంజాబీ సినిమాపాట ఒకటి సంచలనాలు సృష్టిస్తోంది. అయితే ఈ పాటలో అభినయించివారు పెద్ద స్టార్స్ కాకపోవడం ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం. 'లోంగ్ లాచీ' సినిమాలోని ఈ పాట ఎంతో సింపుల్‌గా ఉన్నప్పటికీ కోట్ల మందిని కట్టిపడేయటం విశేషం. 
 
గాయకుడు, నటుడు ఎమీ విర్క్ సినిమా లోంగ్ లాచీలో అతని సరసన పంజాబీ నటి నీరూ బాజ్వా నటించింది. కాగా ఈ సినిమా ప్రొడక్షన్‌ను కూడా నీరూ బాజ్వానే పర్యవేక్షించారు. యూట్యూబ్‌లో ఈ ఏడాది అత్యధిక వీక్షణలు అందుకున్న పాటగా ఇది నిలిచింది. ఈ పాటను ఇప్పటివరకూ మొత్తం 46 కోట్ల మందికిపైగా వీక్షించారు. ఆ పాటను మీరూ ఓసారివినండి.