సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 19 డిశెంబరు 2017 (09:59 IST)

'కడప'ను తిరగేస్తే పడక.. అది చావు పడకేనంటున్న వర్మ.. టైటిల్ సాంగ్ లిరిక్స్ (వీడియో)

సంచలనాలకు మారుపేరైన టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ కడప పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ను ప్రారభించనున్నారు. ఇందులో కడప ఫ్యాక్షనిజాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించనున్నారు.

సంచలనాలకు మారుపేరైన టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ కడప పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ను ప్రారభించనున్నారు. ఇందులో కడప ఫ్యాక్షనిజాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించనున్నారు. ఇందులోభాగంగా, ఆయన కడప పేరుతో రిలీజ్ చేసిన ఓ ట్రైలర్ ఇప్పటికే తీవ్రవివాదాస్పదమైంది.
 
ఈ నేపథ్యంలో తాను తీస్తున్న వెబ్ సిరీస్ 'కడప' టైటిల్ సాంగ్‌ను మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ విడుదల చేశాడు. ఈ పాటలోని లిరిక్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఈ పాటను సిరాశ్రీ రాశారు.
 
"కడప కడప కడప కడప కడప కడప కడప
అది యమద్వారపు గడప
కడప కడప కడప కడప కడప కడప కడప
అది బలిపీటపు గడప
కడపంటే ఫ్యాక్షన్, కడపంటే యాక్షన్
కడపంటే ఓ టెన్షన్, కడపే అటెన్షన్
కడపంటే ఊరు కాదు... బాంబురా కొడకా
కడపంటే పేరు కాదు... మృత్యువురా కొడకా
కడపకెదిరి తొడగొడితే గోతిలేనే పడక
కడపను తిరగేస్తే పడక కానీ అది చావు కొడకా"...!
 
అని సాగుతున్న ఈ పాటపై ఇంకెన్ని విమర్శలు వస్తాయో?! ఆ వీడియోను మీరూ చూడండి. ఈ సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది.