సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 నవంబరు 2023 (19:39 IST)

రజనీకాంత్, చిరంజీవిలకు తగిన స్టోరీలున్నాయ్.. రాఘవ లారెన్స్

Raghava Lawrence
డ్యాన్స్ మాస్టర్‌గా, నటుడిగా, దర్శకుడిగా విజయవంతమైన కెరీర్‌ను కలిగి ఉన్న రాఘవ లారెన్స్ ఇటీవల రజనీకాంత్, చిరంజీవి వంటి దిగ్గజ నటులతో పనిచేయాలనే తన ఆకాంక్ష గురించి చెప్పాడు. తాను రజనీకాంత్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే సరైన సమయం కోసం వేచి చూస్తున్నానని తెలిపాడు.  
 
అదేవిధంగా, తెలుగు అగ్ర హీరోలైన చిరంజీవి, నాగార్జునతో కలిసి పని చేసేందుకు.. ఇందుకు తగిన కథలు సిద్ధంగా వున్నాయని చెప్పాడు. అలాంటి అవకాశాలు రావాలంటే సరైన సమయం ఉండాలని రాఘవ లారెన్స్ అన్నాడు.  
 
అయితే తనకు ప్రస్తుతం హీరోగా ఆఫర్లు వస్తున్నాయని, ఈ మధ్య కాలంలో దర్శకత్వం వైపు వెళ్లడం లేదని లారెన్స్ పేర్కొన్నాడు. మళ్లీ దర్శకత్వం వహిస్తే "కాంచన"కి సీక్వెల్ తీయాలని ఆలోచిస్తానని చెప్పాడు.