Sanjay Dutt, Shilpa Shetty and others
హైదరాబాద్‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడ ఎంతో మందితో కలిసి పని చేశాను. మరీ ముఖ్యంగా నాకు హైదరాబాద్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. నేను ప్రభాస్ రాజా సాబ్ సినిమాకు పని చేస్తున్నాను. అక్కడే తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. నాకు తెలుగులో చిరంజీవి గారంటే చాలా ఇష్టం అని సంజయ్ దత్ అన్నారు.
కన్నడ యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా హీరోగా కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మాత వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ ఎత్తున నిర్మించిన చిత్రం కేడీ ది డెవిల్. ఈ సినిమాను ప్రేమ్ తెరకెక్కించారు. ఈ మూవీలో ధృవ సర్జాకు జోడిగా రీష్మా నానయ్య నటించారు. ఇక ఈ ప్రాజెక్ట్‌లో సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహి వంటి వారంతా ముఖ్య పాత్రల్ని పోషించారు. గురువారం రాత్రి ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు.
*ధృవ సర్జా మాట్లాడుతూ* .. కేడీ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా కెమెరామెన్ విలియం, మా నిర్మాత వెంకట్, సుప్రిత్, మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ అందరికీ ధన్యవాదాలు. నాకు సంజయ్ దత్ గారు అంటే ఎంతో ఇష్టం. ఆయనతో పని చేయడం ఆనందంగా ఉంది. శిల్పా శెట్టి వంటి యాక్టర్లతో పని చేయడం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. సెట్స్ మీద ఆమె మా యాక్టింగ్‌ను కరెక్ట్ చేస్తుంటారు. రీష్మా మంచి నటి. మా మూవీ త్వరలోనే రాబోతోంది. అందరూ చూడండి. అందరికీ నచ్చుతుంది అని అన్నారు.
*దర్శకుడు ప్రేమ్ మాట్లాడుతూ, జోగి అని నేను కన్నడలో తీస్తే తెలుగులో ఇక్కడ యోగి అంటూ చేశారు. కానీ అప్పుడు రీమేక్ చేయమని అడిగారు. కానీ నాకు భాష తెలీదు కదా అని చేయలేను అని చెప్పాను. నేను తెలుగులో ఎక్కువగా చిత్రాలు చూస్తుంటాను. చిరంజీవి గారి ఇంటికి తరుచుగా వెళ్తుంటాం. ఇప్పుడు నేను కేడీ చిత్రంతో రాబోతోన్నాను. టీజర్ ఆల్రెడీ అందరినీ ఆకట్టుకుంటోంది. నా ఫ్రెండ్, ఫ్యామిలీ పర్సన్ ధృవ సర్జా నాకు ఈ ప్రయాణంలో అండగా నిలిచారు. కాళిదాసు పాత్రలో ఎంతో ఎమోషన్ ఉంటుంది. ఈ మూవీ ఆడియెన్స్ రైట్స్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. అందరికీ ఈ చిత్రం నచ్చుతుందని భావిస్తున్నా అని అన్నారు.
*శిల్పా శెట్టి మాట్లాడుతూ* .. హిందీలో కాకుండా నేను మొదటగా తెలుగులో సినిమాను చేశాను. సాహసవీరుడు సాగర కన్య అని సినిమాను చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు వారు నాపై అదే ప్రేమను చూపిస్తున్నారు. సత్యవతి పాత్రను నాకు ఇచ్చిన డైరెక్టర్ ప్రేమ్ గారికి థాంక్స్. కేవీఎన్ వెంకట్ గారికి సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉంది. ధృవ, రీష్మాలతో పని చేయడం సంతోషంగా ఉంది. సంజయ్ దత్ గారితో నేను చేసిన ప్రతీ సినిమా హిట్ అయింది. అదే ట్రెండ్ ఇప్పుడు కంటిన్యూ అవుతుందని భావిస్తున్నాను. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను. ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ అంశాలున్నాయి. ఈ మూవీని ప్రేమ్.. ఎంతో ప్రేమతో తెరకెక్కించారు అని అన్నారు.
*రీష్మా నానయ్య మాట్లాడుతూ, సంజయ్ దత్ గారు చాలా మంచి వ్యక్తి. మనం చెప్పేవన్నీ ఆయన ఓపికతో వింటారు. శిల్పా శెట్టి మేడం సెట్స్ మీదకు ఓ ఎనర్జీని తీసుకు వచ్చేవారు. ఆమెను చూసి నేను ఎంతో నేర్చుకున్నాను. ధృవ సర్‌తో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన తోటి ఆర్టిస్టుల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తుంటారు. కేవీఎన్ లాంటి భారీ సంస్థలో పని చేయడం ఆనందంగా ఉంది. మా చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది అని అన్నారు.
*కేవీఎన్ ప్రొడక్షన్ బిజినెస్ హెడ్ సుప్రిత్ మాట్లాడుతూ* .. ముంబైలో టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇంత మంచి మాస్ టీజర్‌ను ఇచ్చిన ప్రేమ్ గారికి థాంక్స్. రేపు కొచ్చి, బెంగళూరు, చెన్నైలో ఈవెంట్లు ప్లాన్ చేశాం. ఎంతో బిజీగా ఉన్నా కూడా మాతో పాటుగా వస్తున్న సంజయ్ దత్ గారికి థాంక్స్. టీజర్‌లో ధృవ సర్ చేసింది చాలా తక్కువ. తెరపై ఆయన అదరగొట్టేస్తారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాత వెంకట్ గారికి థాంక్స్ అని అన్నారు.
నటీనటులు : ధృవ సర్జా, రీష్మా నానయ్య, వి రవిచంద్రన్, రమేష్ అరవింద్, సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహి, యష్ శెట్టి తదితరులు