సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2022 (08:53 IST)

లైగ‌ర్ డిస్నీలో వ‌చ్చేసింది- అనుకున్న రేటు వ‌చ్చిందా!

liger disney poster
liger disney poster
విజ‌య‌దేవ‌ర‌కొండ‌, అన‌న్య‌పాండే జంట‌గా న‌టించిన లైగ‌ర్ సినిమా థియేట‌ర్‌లో విడుద‌ల‌కుముందు ఎంత హైప్ క్రియేట్ చేసిందో తెలిసిందే. పూరీ జ‌గ‌న్నాథ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. చార్మికౌర్ ఒక పార్ట‌న‌ర్‌. ఈ సినిమాను క‌ర‌ణ్ జోహార్ త‌న భుజాల‌పై వేసుకుని బాలీవుడ్‌లో ప్ర‌చారం చేశాడు. ఆ సినిమాకు ఆయ‌న కూడా పార్ట‌న‌ర్‌. అయితే ఈ సినిమా విడుద‌ల‌కుముందుగానే ఓటీటీ ఆఫ‌ర్ వ‌స్తే థియేట‌ర్ త‌ర్వాత చూద్దాం అన్న‌ట్లుగా పూరీ చెప్పాడ‌నీ అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. అయితే సినిమా విడుద‌ల త‌ర్వాత అనుకున్నంత స‌క్సెస్ రాక‌పోవ‌డంతో విమ‌ర్శ‌లు ఎక్కువ‌గా వ‌చ్చాయి. 
 
ఇక ఇప్పుడు బిజినెస్ కోసం ఓటీటీ మార్కెట్‌కు వెళ్ళాల్సివ‌చ్చింది. ప్ర‌స్తుతం డిస్నీ +హాట్‌స్టార్ ఈచిత్రం ప్రసారం కాబోతుంది. దీనిని బ‌ట్టి ఈ సినిమాకు అనుకున్నంత మార్కెట్ రాలేద‌ని తెలుస్తోంది. ఇందులో మైక్ టైస‌న్ వుండ‌డంతో సినిమాను బాగా మార్కెట్ చేసుకున్నారు. ఆ టైంలోనే ఓటీటీకి ఆఫ‌ర్ వ‌స్తే ముందు వ‌ద్ద‌ని ద‌ర్శ‌కుడు చెప్పిన‌ట్లు తెలుస్తోంది.