మంగళవారం, 26 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 మార్చి 2023 (13:30 IST)

బాలీవుడ్ నటి మాధూరి దీక్షిత్‌కు మాతృవియోగం

madhuri mother
బాలీవుడ్ నటి మాధూరి దీక్షిత్‌కు మాతృవియోగం కలిగింది. ఆమె తల్లి స్నేహలత దీక్షిత్ కన్నుమూశారు. ఆమెకు వయసు 91. ముంబైలోని స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని మాధూరి దీక్షిత్ భర్త శ్రీరామ్ నేనే వెల్లడించారు. స్నేహలత దీక్షిత్ కుటుంబ సభ్యుల సమక్షంలోనే తుదిశ్వాస విడిచినట్టు తెలిపారు. 
 
కాగా, వర్లీలోని శ్మశానవాటికలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు స్నేహలతా దీక్షిత్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే, ఆమె మృతికి కారణాలు తెలియరాలేదు. వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్య సమస్యల కారణంగా చనిపోయివుంటారని భావిస్తున్నారు. 
 
కాగా, గత యేడాది తన తల్లి 90వ పుట్టినరోజు వేడుకలను మాధూరి దీక్షిత్ ఘనంగా నిర్వహించి, దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా షేర్ చేసారు. కుమార్తెలకు తల్లికి మించిన ఆప్తమిత్రులు లేరని వ్యాఖ్యానించారు. తనకు జీవితంలో ఎన్నో విషయాలు నేర్పించిన తల్లికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అని తెలిపారు. ఆమెకు సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటున్నట్టు ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశారు.