బుధవారం, 8 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : సోమవారం, 6 అక్టోబరు 2025 (15:08 IST)

Suman: రెగ్యులర్ షూటింగ్ లో ఉదయ భాస్కర వాగ్దేవి డైరెక్టన్ లో మహానాగ

On Suman, Ramakanth, Sravani Muppirala Clap by K .L. Damodara Prasad
On Suman, Ramakanth, Sravani Muppirala Clap by K .L. Damodara Prasad
భీమవరం టాకీస్ వారి 15 చిత్రాల్లో ఒకటైన మహానాగ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. సీనియర్ హీరో సుమన్, హీరో రమాకాంత్, హీరోయిన్ శ్రావణి ముప్పిరాల (తొలి పరిచయం)పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఎల్.దామోదర ప్రసాద్ క్లాప్ కొట్టగా... ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు గౌరవ దర్శకత్వం వహించారు.
 
భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఉదయ భాస్కర వాగ్దేవి దర్శకుడు. శ్రీకావ్య, టంగుటూరు రామకృష్ణ, బస్ స్టాప్ కోటేశ్వరరావు, జబర్దస్త్ అప్పారావు, సుబ్బలక్ష్మి,  టి.ఆర్.ఎస్., ధీరజ అప్పాజీ, సంధ్య వర్షిణి ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తి చేసుకుని, రెండో షెడ్యూల్ తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో జరుపుకోనుంది. ఒకేసారి 15 చిత్రాలకు కొబ్బరికాయలు కొట్టి చరిత్ర సృష్టించిన రామ సత్యనారాయణ... ఏడాది లోపు ఈ చిత్రాలన్నీ విడుదల చేసి, మరో చరిత్ర నమోదు చేయాలని అతిధులు ఆకాంక్షించారు.
 
ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ అప్పాజీ, సహాయ దర్శకులు: సి.పి.రెడ్డి - నాగేష్, మేకప్: రఘు, కాస్ట్యూమ్స్: తిరుమల, ఎడిటింగ్ & గ్రాఫిక్స్: హర్ష, సంగీతం: సంధ్యవర్షిణి - ప్రదీప్, కెమెరా: ఆర్. భాస్కర్, కో-ఆర్డినేటర్: ఫణీంద్ర - నాగేష్, నిర్మాత; తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రచన - దర్శకత్వం: ఉదయ భాస్కర వాగ్దేవి.