శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 13 జులై 2017 (12:00 IST)

స్పైడర్ సెట్స్‌లో కడుపుబ్బా నవ్వుకున్న మహేష్.. వీడియో చూడండి..

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న స్పైడర్ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రికార్డు సృష్టించింది. ఈ సినిమా టీ

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న స్పైడర్ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రికార్డు సృష్టించింది. ఈ సినిమా టీజర్‌కు కేవలం 24 గంటల్లోనే 6.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ రికార్డు అక్కడితే ఆగకుండా యూట్యూబ్‌లో.. కోటి ముఫ్ఫై లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించింది.
 
'గ్లిమ్స్ ఆఫ్ స్పైడర్' పేరుతో రిలీజైన టీజర్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో స్పైడర్ చిత్రం సెట్‌లో చోటుచేసుకున్న ఓ సరదా సన్నివేశం వీడియోను మురుగదాస్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘స్పైడర్ సెట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌తో మహేశ్ బాబు బుగ్గు గిల్లుతూ కడుపుబ్బ నవ్వుకున్నాడు. ఈ వీడియోలో చిత్ర యూనిట్ సభ్యుల కామెంట్లు కూడా వినపడుతున్నాయి. మహేష్ స్మైల్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది. ఇప్పటికే 123,880 వ్యూస్ సాధించింది.