మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2019 (16:34 IST)

ఏఎంబీలో హీరో మహేష్ మైనపు బొమ్మ

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మైనపు విగ్రహం సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్‌లో ఏర్పాటు చేశారు. దక్షిణ భారతదేశానికి చెందిన ఒక హీరో మైనపు బొమ్మను టుస్సాడ్‌లో ప్రతిష్టించడం ఇదే తొలిసారి. ఈ తరహా ఘనతను సాధించిన తొలి హీరో కూడా ఆయనే. 
 
అయితే ఈ మైనపు బొమ్మను చూసేందుకు ప్రతి ఒక్కరూ అక్కడకు వెళ్లడం సాధ్యపడదు. అందుకే ఆ తరహా విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ నగరంలోని గచ్చీబౌలిలో మహేష్ బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్‌లో దాన్ని కొద్దిరోజులు పాటు ఉంచబోతున్నారు. 
 
అభిమానులు వచ్చి సూపర్ స్టార్ విగ్రహంతో ఫొటో దిగొచ్చు. తర్వాత సింగపూర్ తరలించి అక్కడి టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచనున్నారు. ఇందులో మ‌హేష్ హెయిర్‌స్టైల్ స‌రికొత్త‌గా ఉండగా, ఇది అభిమానుల‌ని ఆకట్టుకుంది. 
 
ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.. అయన త‌న 25వ చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నారు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 25వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చిత్రం టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. యంగ్ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రను పోషిస్తున్నాడు.