శనివారం, 22 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 21 మార్చి 2025 (12:06 IST)

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Gautham
Gautham
తన కుమారుడి ప్రస్తావన వచ్చినప్పుడల్లా మహేష్ బాబు నటుడిగా ఇంకా టైంముంది. అసలు ముందు చదువుకోవాలి. వాడి మైండ్ ఏముందో మనకు తెలీదు అంటూ చెప్పుకొచ్చాడు. కొడుకునువిదేశాల్లో చదివిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ చదువుతోపాటు స్టేజీ షో లు కూడా ఇంట్రెస్ట్ ను బట్టి ఎడ్యుకేషన్ లో ఓ బాగంగా వుంటుందట. 
 
 ప్రస్తుతం గౌతమ్ ఘట్టమనేని అమెరికాలోని ప్రతిష్టాత్మక NYU టిష్ స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్‌లో డ్రామా అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో నాలుగు సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ చదువుతున్నాడు.  నిన్న రాత్రి సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టడంతో పాపులర్ అయిపోయాడు.
 
ఆ వీడియోలో డైనింగ్ టేబుల్ వద్ద ఒక యువతితో జరిగిన వాగ్వాదంలో భావోద్వేగాలను అద్భుతంగా చిత్రీకరించాడు, అయితే అతని మనోహరమైన లుక్స్ అతని తండ్రిని గుర్తుకు తెస్తాయి. తెలుగు సినిమాలో మహేష్ బాబు వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నెటిజన్లు ఇప్పటికే అతన్ని నిజమైన వారసుడిగా పిలుస్తున్నారు.
 
అంతకుముందే గౌతమ్ సోదరి సితార, తన సోదరుడు సమీప భవిష్యత్తులో తన నటనా రంగ ప్రవేశం చేయబోతున్నాడని కొన్ని వీడియోల ద్వారా తెలియజేశారు. సమాచారం మేరకు నాలుగు సంవత్సరాల తర్వాత వెండితెరపై గౌతమ్ కనిపించనున్నాడన్నమాట.