బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (10:59 IST)

బిగ్ బాస్ షోలో మహేష్ బాబు కోడలు శిల్పా శిరోద్కర్?!

Shilpa Shirodkar
Shilpa Shirodkar
బిగ్ బాస్ 18 అక్టోబర్ 5న కలర్స్ టీవీ, జియో సినిమాల్లో ప్రసారం కానుంది. ఈ సీజన్‌లో పోటీదారుల గురించి చాలా ఊహాగానాలు ఉన్నాయి. వీరిలో ఓ పేరు అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ఎవరంటే.. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు బంధువు. శిల్పా శిరోద్కర్, ఎవరంటే మహేష్ బాబు కోడలు. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ షోలో ఆమె పాల్గొనవచ్చని టాక్ వస్తోంది. 
 
ఇక మహేష్ బాబు బిగ్ బాస్ తెలుగు సీజన్ 4కి హోస్ట్‌గా పనిచేయాల్సింది. కానీ అది జరగలేదు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బిగ్ బాస్ షోలో మహేష్ కోడలు శిల్పా శిరోద్కర్ పాల్గొనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 
 
శిల్పా శిరోద్కర్ నటిగానూ ఫేమస్. ప్రస్తుతం సినిమాలకు దూరమైన ఆమె బ్యాంకింగ్‌ రంగంలో  పనిచేస్తున్న తన భర్తతో కలిసి విదేశాలకు వెళ్లింది. ఆమె 2013లో ఏక్ ముత్తి ఆస్మాన్ షోతో టెలివిజన్‌కు తిరిగి వచ్చింది. 
 
ఈ సందర్భంగా శిల్పా మహేష్ బాబు ఫ్యామిలీతో తనకున్న సన్నిహిత బంధం గురించి వెల్లడించింది. మహేష్ బాబు తనకు బలమైన మద్దతునిచ్చాడని పేర్కొంది. కొన్నిసార్లు తన సోదరి నమ్రతా శిరోద్కర్ కంటే కూడా ఎక్కువగా తనకు సపోర్ట్ చేసేవాడని తెలిపింది. ప్రస్తుతం శిల్పా బిగ్ బాస్ షోలో పాల్గొనడం ద్వారా ఆమెకు మరిన్ని సినిమా అవకాశాలు వచ్చే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.