బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (11:14 IST)

మహేష్ బాబు సినిమా అప్ డేట్ అడిగితే కర్రతీసిన రాజమౌళి

Rajamouli try to beat with stick
Rajamouli try to beat with stick
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, సక్సెస్ ఫుల్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కలయికలో రాబోతున్న సినిమా గురించి అప్ డేట్ ఇంతవరకు చిత్ర టీమ్ ఎవ్వరూ చెప్పకపోయినా ఏదో రకంగా న్యూస్ లు వస్తూనే వున్నాయి. అయితే చాలాకాలం క్రితమే రాజమౌళి తండ్రి, కథా రచయిత విజయేంద్రప్రసాద్ దీని గురించి టీవీ ఛానల్ లో ఓ సందర్భంలో మాట్లాడుతూ, వందల ఏళ్ళ నాటి కథ. హాలీవుడ్ స్థాయి సినిమా చేయబోతున్నట్లు వెల్లడించారు. అంతకంటే ఇంకేమీ మాట్లాడలేదు. ఆ తర్వాత మహేష్ తో సినిమా చేయడానికి సిద్ధమయినట్లు ప్రకటించారు కూడా.
 
మహేష్ బాబు షూటింగ్ ప్రీప్రొడక్షన్ లో వుంది. మధ్యలో విదేశాల్లో వెళ్ళి లొకేషన్లలో చూశారు కూడా. మహేష్ బాబు ఆహార్యంలో కొంత ఛేంజ్ కూడా మార్పు చేశారు. గెడ్డం పెంచుకున్న ఫొటోలు కూడా ఎయిర్ పోర్ట్ లో వెళుతుండగా ఫొటోగ్రాఫర్లు క్లిక్ చేశారు. తాజా సమాచారం మేరకు డిసెంబర్ లో జర్మనీకి చిత్ర యూనిట్ వెళ్ళనుంది. అక్కడ కొన్ని లొకేషన్లలో చిత్రానికి సంబంధించిన సన్నివేశాలను బేరీజు వేస్తారని తెలుస్తోంది.
 
ఇదిలా వుండగా, మత్తువదలరా 2 టీమ్ సభ్యులు రాజమౌళి ఇంటికి వెళ్ళి ప్రచారానికి సహకరించాలని కోరే వీడియో విడుదల చేశారు. అందులో తమ సినిమాకు ప్రచారం చేయాలి అనగానే.. అనగా సెప్టెంబర్ రాబోతున్న సినిమా చూసి ఎంజాయ్ చేయండి అన్నారు. ఆ తర్వాత మహేష్ బాబు సినిమా గురించి అప్ డేట్ అడగగానే.. ఇక్కడ కర్ర వుండాలే అనగానే.. శ్రీసింహ ఇదుగో అంటూ చిన్న కర్ర చూపాడు. అదికాదురా అంటూ.. పెద్ద కర్ర తీసి అప్ డేట్ కావాలా? అప్ డేట్.. ఇంకా కథ పనిలో వుండగా.. అంటూ రాజమౌళి అన్నారు. సో..  ప్రేక్షకుల్లోనూ, అభిమానుల్లోనూ వున్న ఆత్రుతను తెలియజేస్తూ రాజమౌళి చేసిన వీడియోలా అనిపించింది. 
 
కాగా, దసరాకు రాజమౌళి కొత్త అప్ డేట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.  అప్పుడు సినిమాపై క్లారిటీ రాగలదు.