ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2024 (15:01 IST)

ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య!!

anil arora
బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి టెర్రస్‌పై నుంచి కిందకు దూకడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన ముంబైలో జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే బాంద్రా పోలీసులు, క్రైం బ్రాంచ బృందం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనా ప్రదేశంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. 
 
కాగా, ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సమాచారం. ఘటన జరిగిన సమయంలో మలైకా అరోరా ముంబైలో లేరు. ఆమె పూణెలో ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఆమె పూణెకు బయలుదేరారు. కాగా, తన తండ్రి ఆత్మహత్యపై ఆమె స్పందించలేదు. 
 
మరోవైపు,మలైకా తండ్రి అనిల్ అరోరా మరణంతో బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. పలువురు బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు ఆమె ఇంటికి వెళ్లి అనిల్ అరోరాకు నివాళులు అర్పిస్తున్నారు.