గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 జులై 2022 (19:19 IST)

ముద్దు పెట్టడాన్ని, బికినీ తప్పు పట్టారు.. మల్లికా శెరావత్

Mallika Sherawat
బాలీవుడ్‌ హీరోయిన్‌ మల్లికా షెరావత్‌ నటించిన తాజా చిత్రం ఆర్కే. త్వరలోనే ఈ మూవీ రిలీజ్‌ కానుంది. ఆర్కే సినిమాలో మల్లికా శెరావత్‌తో పాటు కుబ్ర సైత్‌, రణ్‌వీర్‌ షోరే, మను రిషి చద్ద, చంద్రచూర్‌ రాయ్‌, అభిజీత్‌ దేశ్‌పాండే, అభిషేక్‌ శర్మ, గ్రేస్‌ గిరిధర్‌, వైశాలి మల్హారా తదితరులు నటించారు. 
 
ఈ సినిమా జూలై 22న విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మల్లిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
 
ముద్దు పెట్టడాన్ని, బికినీ వేసుకోవడాన్ని చాలా తప్పుపట్టారు. ఇండస్ట్రీలోని కొంతమంది వ్యక్తులు నన్ను మానసికంగా వేధించారు. కేవలం గ్లామర్‌ ఒలకబోయడం తప్ప నటన రాదని తిట్టిపోశారు. 'దీపికా పదుకొణె గెహ్రియాన్‌లో ఏం చేసిందో 15 ఏళ్ల క్రితం మర్డర్‌లో నేనూ అదే చేశాను. కానీ అప్పుడు జనాల ఆలోచనా స్వభావం ఎంతో సంకుచితంగా ఉండేది.. అని తెలిపింది.
 
దశావతారం, ప్యార్‌కి సైడ్‌ ఎఫెక్ట్స్‌, వెల్‌కమ్‌ వంటి సినిమాలు చేసినా కూడా ఎవరూ నా నటనను పట్టించుకోలేదు' అని మల్లికా శెరావత్‌ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు బీటౌన్‌లో వైరల్‌గా మారాయి.