మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 7 మార్చి 2022 (13:55 IST)

మమ్ముట్టి ఏజెంట్ పోస్ట‌ర్ వైర‌ల్‌

Mammootty poster
అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ `ఏజెంట్`.  అఖిల్ యాక్షన్-ప్యాక్డ్ రోల్‌లో కనిపిస్తాడు. ఇందులో అతనిలోని సరికొత్త కోణం కనిపిస్తుంది.
 
స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన కథానాయికగా కొత్త నటి సాక్షి వైద్య ఎంపికైంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు.
 
ఈ చిత్రంలో ప్రముఖ న‌టులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి  పూర్తి నిడివి గ‌ల ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు.
 
హైప్ క్రియేట్ చేస్తున్న మమ్ముట్టి పోస్ట‌ర్ 
ఏజెంట్ తాజా షెడ్యూల్ ఈరోజు ప్రారంభమయింది. ఇందులో మమ్ముట్టి  పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ మమ్ముట్టి పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. `ద డెవిల్ రూత్‌లెస్ సేవియ‌ర్‌` అంటూ ఇంట్రెస్టింగ్ కాప్ష‌న్ పెట్టింది. అందుకు త‌గిన‌ట్లుగా  క్రూరమైన రక్షకుడు గా ఆ లుక్‌లో క‌నిపించాడు. లుక్స్ ప‌ర్‌ఫెక్ట్‌గా వున్నాయి. పోస్ట‌ర్‌లో ఆయ‌న కేరెక్ట‌ర్‌ను హైప్ పెంచేసింది. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.
 
సెన్సేషనల్ కంపోజర్ హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నారు. రఘుల్ హెరియన్ ధరుమన్ కెమెరా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలు.
 
తారాగణం: అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య, మమ్ముట్టి
దర్శకుడు: సురేందర్ రెడ్డి
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
సహ నిర్మాతలు: అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి
బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా
కథ: వక్కంతం వంశీ
సంగీత దర్శకుడు: హిప్ హాప్ తమిజా
DOP: రగుల్ హెరియన్ ధరుమన్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా
విన్యాసాలు: శివుడిని స్టన్ చేస్తాడు
PRO: వంశీ-శేఖర్