మంగళవారం, 15 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 డిశెంబరు 2022 (15:03 IST)

జోసెఫ్ గురించి చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నా.. హీరో మమ్ముట్టి

mammootty
యువ దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యల పట్ల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి విచారం వ్యక్తం చేశారు. జోసెఫ్‌పై తాను చేసిన వ్యాఖ్యలపట్ల చింతిస్తున్నట్టు చెప్పారు. ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయబోనని చెప్పారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించివుంటే క్షమించాలని కోరారు. 
 
కాగా, జోసెఫ్ తెరకెక్కించిన తాజా చిత్రం "2018". దీని ట్రైలర్‌ను మమ్ముట్టి లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జోసెఫ్ తలపై ఎక్కువ జట్టు లేకపోవచ్చు కానీ, ఆయన చాలా తెలివైనవాడు అని ప్రశంసించారు. ఈ వ్యాఖ్యలే వివాదానికి కారణమయ్యాయి. కొందరు ఈ వ్యాఖ్యలను నెగెటివ్‌గా తీసుకున్నారు. జోసెఫ్‌ను మమ్ముట్టి బాడీ షేమింగ్ చేశారంటూ కామెంట్స్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగుతోంది. 
 
దీంతో మమ్ముట్టి స్పందించారు. జోసెఫ్‌ను ప్రశంసిస్తూ తాను చేసిన వ్యాఖ్యలు కొందరిని బాధించాయని, తన వ్యాఖ్యలకు చింతిస్తున్నాని మమ్ముట్టి అన్నారు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడతానని చెప్పారు. 
 
మరోవైపు, మమ్ముట్టికి జోసెఫ్ కూడా మద్దతు తెలిపారు. తన హెయిర్ లాస్ గురించి ఎవరైనా నిజంగా ఆందోళన చెందుతుంటే షాంపూ కంపెనీలు, నీటిని సరఫరా చేస్తున్న బెంగుళూరు కార్పొరేషన్‌కు వ్యతిరేకంగా గళాన్ని వినిపించాలని సూచించారు.