బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2022 (14:53 IST)

అబ్బే అలా అనుకుంటే పొరపాటు... మృణాల్ సింగ్

mrunal thakur
హీరోయిన్లు సిస్టర్స్ పాత్రలో కనిపిస్తే అవకాశాలు తగ్గిపోతాయని వస్తున్న వార్తలపై సీతారామం హీరోయిన్ మృణాల్ సింగ్ స్పందించింది. చెల్లెలు, భార్యల పాత్రల్లో కనిపిస్తే.. ఆఫర్లు తగ్గిపోతాయని చెప్పడం అపోహ మాత్రమేనని వెల్లడించింది. రూల్స్ బ్రేక్ చేసినప్పుడే మనమేంటో ఇతరులకు అర్థం అవుతుందని చెప్పుకొచ్చింది. 
 
ఏ పాత్రలోనైనా ప్రేక్షకులను మెప్పించడమే నిజమైన ప్రతిభగా భావించాలని తెలిపింది. కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఓ సూపర్ రోల్ మిస్ చేసుకున్నానని ఫీల్ కాకూడదని వెల్లడించింది. కాగా పిప్పా చిత్రంలో చెల్లెలి పాత్ర తన హృదయానికి చాలా దగ్గరైందని.. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని తెలిపింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ఇటీవల విడుదలైన సీతారామం సినిమా ద్వారా ఓవర్ నైట్ స్టార్ గా మారింది. ప్రస్తుతం ఈమె పిప్పా చిత్రంలో నటిస్తోంది. ఇది వార్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఇషాన్ కట్టర్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో ఇషాన్ కట్టర్ సోదరిగా మృణాల్ కనిపిస్తోంది.