శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Preeti
Last Modified: బుధవారం, 6 జూన్ 2018 (17:48 IST)

మంచు లక్ష్మక్క యోగా టీచర్ ఎవరో తెలుసా?

జీవనశైలిలో ఆధునికత పెరుగుతున్నకొద్దీ ఒత్తిడి పెరిగి అనేక సమస్యలతో సమతమతమవుతున్నాము. ఈ సమస్యల నుండి బయటపడాలంటే ఇప్పుడు మన దగ్గరున్న అతి సులువైన ఆయుధం యోగా. అయితే యోగాలో విభిన్న రకాలు ఉంటాయి. ప్రస్తుతం యోగా కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నప్పటికీ

జీవనశైలిలో ఆధునికత పెరుగుతున్నకొద్దీ ఒత్తిడి పెరిగి అనేక సమస్యలతో సమతమతమవుతున్నాము. ఈ సమస్యల నుండి బయటపడాలంటే ఇప్పుడు మన దగ్గరున్న అతి సులువైన ఆయుధం యోగా. అయితే యోగాలో విభిన్న రకాలు ఉంటాయి. ప్రస్తుతం యోగా కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నప్పటికీ శాస్త్రీయపరమైన యోగా కేంద్రాలు అరుదుగా ఉన్నాయి. 
 
శాస్త్రీయ యోగా తెలిసినవారు మాత్రమే దానిని శారీరక దృఢత్వాన్ని పెంచే సాధనంగా మాత్రమే కాకుండా మానసికమైన ఒత్తిడులను తగ్గించే మంత్రంగా ఉపయోగించగలుగుతారు. ఇషా ఫౌండషన్ నుండి ట్రైనర్‌గా సర్టిఫై అయిన ఉషా మూర్తినేని, మంచు లక్ష్మికి యోగాలో శిక్షణనిస్తున్నారు. ఆమె నడుపుతున్న హటమ్ స్టూడియోకు మంచు లక్ష్మి అతిథిగా విచ్చేసి తన అనుభవాలను అక్కడి వారితో పంచుకున్నారు. 
 
ఆమె ‘‘యోగా చేయడం మొదలుపెట్టినప్పటి నుండి నా జీవితంపై నాకు పూర్తి నియంత్రణ వచ్చింది. ప్రతిరోజూ ఇన్ని పనులు మేనేజ్ చేయగలుగుతున్నానంటే దానికి కారణం యోగా. క్రమంతప్పకుండా యోగా చేస్తే ఎవరి జీవితంలోనైనా అద్భుతాలు జరుగుతాయి. ఉషా అక్క ఇచ్చిన శిక్షణతో యోగాపై ఆసక్తి ఏర్పడింది. యోగా అనేది మన పూర్వీకుల నుండి సంక్రమించిన ఆస్తి. 
 
ఇలాంటి యోగా కేంద్రాల అవసరం సమాజానికి ఎంతైనా ఉంది. హటమ్ స్టూడియో అన్ని ఆధునిక సౌకర్యాలతో చక్కటి సిక్షణ అందిస్తోంది’’ అని అన్నారు. బిజీ షెడ్యూల్‌లో కూడా స్టూడియోకి రావడం ఎంతో ఆనందంగా ఉందని యోగా ట్రైనర్ ఉష మూర్తినేని ఆనందం వ్యక్తం చేసారు.