గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 6 మే 2023 (16:32 IST)

మంచు మనోజ్ విడుదల చేసిన గడిచిన కాలం ఫ్యూచర్ ఫిల్మ్

Ketan Siva Pritam, Manchu Manoj and others
Ketan Siva Pritam, Manchu Manoj and others
 “గడిచిన కాలం” ఫ్యూచర్ ఫిల్మ్ ని రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గారి చేతులమీదుగా ఈ రోజు హైదరాబాద్ తన నివాసంలో లాంచ్ చేసారు. ఈ ఫ్యూచర్ ఫిల్మ్ మూవీ  చిత్తూరు మాజీ ఎం.పీ దివంగత శివప్రసాద్ గారి మనవడు , కేతన్ శివ ప్రీతమ్ నిర్మించి దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో ‘మంచు మనోజ్’ మాట్లాడుతూ నా తమ్ముడు ప్రీతమ్ ఈ ఫ్యూచర్ ఫిల్మ్ చాలా బాగా తీసాడు, తను త్వరలో మేఘా ఫోన్ పట్టుకుంటాడు దానికి అన్ని రెఢీ చేసుకుంటున్నాడు అని తెలిసింది. అలాగే ప్రితమ్ కూడా తన తండ్రి దివంగత గుంతాటి వేణుగోపాల్ , శివ ప్రసాద్ తాత గార్ల అడుగుజాడల్లో నడుస్తూ కళ మరియు అన్నీ రంగాలలో రానించడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఈ చిత్రంలో నటించిన హీరో అఖిల్ జాక్సన్ ను, సతీష్ గారిని ప్రశంసించారు.
 
దర్శక నిర్మాత ప్రీతమ్ మాట్లాడుతూ నేను చాలా కవర్ సాంగ్స్ షార్ట్ ఫిల్మ్స్ చేశాను ఇంకా నా టాలెంట్  ఒక మినీ మూవీ గా తీసి నెక్స్ట్ మూవీ డైరెక్షన్ ప్లాన్ లో ఉండి  ఈ ఫ్యూచర్ ఫిల్మ్  చాలా కష్టపడి ఖర్చుకు వెనకాడకుండా తీసాము, ఈ రోజు మే 6వ తేదీన తన యూట్యూబ్ చానెల్. కె.ఎస్.పి.టాకీస్ లో ఈ ఫ్యూచర్ ఫిల్మ్ రిలీజ్ అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రీతమ్ తోపాటు అఖిల్, సతీష్, చంద్రశేకర్, మధుసూదన్ , హిమ షేకర్ పాల్గొన్నారు.