శనివారం, 23 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 12 జూన్ 2023 (16:40 IST)

ఓటీటీలో సెక్స్‌, వయొలెన్స్‌ చిత్రాలువస్తే ఏంచేయాలో చెప్పిన మనోజ్‌ బాజ్‌పేయ్

manoj bajpay
manoj bajpay
ఓటీటీ సినిమాలంటే వయొలెన్స్‌, సెక్స్‌ అంశాలు ఎక్కువగా వున్న చిత్రాలే వస్తున్నాయి. దానికి సెన్సార్‌ లేదు. ఈ విషయమై బాలీవుడ్‌ ఓటీటీ హీరో మనోజ్‌ బాజ్‌పేయ్ మాట్లాడుతూ, కొన్ని సినిమాలు ఓటీటీలోనే రావాలి. చాలామంది దానికోసమే ఎదురుచూస్తుంటారు. వెండితెరపై చూడాలంటే చాలా సమస్యలుంటాయి అని పేర్కొన్నారు.
 
ఆయన నటించిన ‘సర్‌ఫేకెబందా’ చిత్రం జీటీవీ ఓటీటీలో తెలుగు వర్షన్‌ విడుదలచేసింది. 2013లో తీసిన ఈ సినిమాకు 10ఏళ్ళ తర్వాత తెలుగులోకి తీసుకువాడంతో ఎటువంటి ఉద్దేశ్యం లేదని మనోజ్‌ బాజ్‌పేయ్ అన్నారు. అయితే ఈమధ్య ఓటీటీలో కంటెంట్‌ శృంగారం పేరుతో విపరీత పోకడలున్న సినిమాలు రావడంపై ఆయన అభిప్రాయం కోరగా, దానికి పెద్దలే బాధ్యత వహించాలి అన్నారు. ఇంట్లో పేరెంట్స్‌ ముందుగానే అటువంటి సినిమాలు వస్తున్నాయని తెలియగానే స్కిప్‌ చేసేయాలని చెప్పారు. తనకు 13 ఏళ్ళ కుమార్తె వుందనీ, తల్లిదండ్రులుగా మేం అటువంటి సినిమాలను స్కిప్‌ చేస్తామని ఉదాహరణగా పేర్కొన్నారు.