గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 2 మార్చి 2024 (18:15 IST)

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 'గామి' కష్టాలు మామూలుగా లేవుగా

Vishwak Sen,   Chandni Choudhary at himalayas
Vishwak Sen, Chandni Choudhary at himalayas
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గామి' గ్రాండియర్ కి తగ్గట్టు చిత్రం రూపొందింది. దర్శకత్వం విద్యాధర్ కాగిత తొమ్మిదేళ్ళ క్రుషి చేసుకున్న కథ. ఈ కథను మొత్తం చదవమని చెప్పేవాడు. పెద్ద బండిల్ లా వుండేది. అమ్మో ఇంత చదవాలా అనిపించేది. కానీ రానురాను చదివాక.. ఇందులో నాకు తెలిని విషయాలు చాలా వున్నాయి అనిపించింది. అందుకే  ఈ కథ రావడం చాలా అద్రుష్టంగా భావిస్తున్నట్లు విశ్వక్ సేన్ చెప్పారు. 
 
సహజంగా ఏ సినిమాకైనా ఇది ఇలా వుంటేబాగుంటుంది.. అంటూ చిన్నపాటి సలహాలు హీరో ఇస్తుంటా.  కానీ గామి సినిమాకు టచ్ చేయడానికి కూడా అవకాశం లేకుండా దర్శకుడు రాసుకున్నారు. తను చెప్పిందే చేస్తే చాలు అనుకున్నానని మనసులోని మాట చెప్పాడు.
 
ఈ సినిమా షూట్ పలు కష్టాల గురించి చెబుతూ, కథరీత్యా హిమాలయాల్లోని మంచు కొండల్లో చేయాల్సి వచ్చింది. మైనస్ డిగ్రీల టెంపరేచర్ లో చేయడం చాలా సాహసమే. ఒక్కోెసారి లొకేషన్ కు వెళ్ళాంటే కారుకానీ, జీపు కానీ టైర్లుతో వెళ్ళలేం. టైర్లు చాలా సార్లు పంచర్లు అయ్యాయి. అందుకే అక్కడ తిరిగే వాహనాల టైర్లకు గొలుసులు కట్టి ప్రయాణం సాగిస్తారు. 
 
ఆ తర్వాత కొంత పార్ట్ హైదరాబాద్ శివార్లో తీయాల్సి వచ్చింది. మంచు ఎఫెక్ట్ కోసం ఉప్పు బస్తాలు పరిచి షూట్ చేశారు. మేం వేసుకున్న డ్రెస్ లో ఉప్పు లోపలికి వెల్ళిపోయేది. దానిని తీయడానికి లేదు. చుట్టూ టీమ్ వుంటుంది. అనుకున్న టైంకు షాట్ తీయాలి. అలానే కష్టపడి చేశాం. నాకంటే హీరోయిన్ చాందిని చౌదరి కష్టం వర్ణనాతీతం. అయినా ఛాలెంజ్ గా పాత్రను చేసింది. ఆమె షూట్ లో కష్టాలు పడినా పైకి చెప్పలేక ప్యాకప్ అనగానే రూమ్ కు పారిపోయేది. నేను కూడా పరుగెత్తికెళ్ళి నా డ్రెస్ లోపల వున్న ఉప్పును తీయడానికి బట్టలు విసిరేసేవాడిని.
 
అసలు నా కెరీర్ లో ఇలాంటి సినిమా చేస్తానని అనుకోలేదు. కానీ దర్శకుడు వల్ల పాన్ ఇండియా స్థాయి సినిమా చేయగలిగాను. అని విశ్వక్ సేన్ అన్నారు.