ఎన్నో అనుకుంటాం.. టైమ్ వచ్చినప్పుడు తప్పదు మరి.. సాయి ధరమ్ తేజ్‌కు పెళ్లి?

Sai Dharam Tej
సెల్వి| Last Updated: సోమవారం, 24 ఆగస్టు 2020 (11:59 IST)
Sai Dharam Tej
''ఎన్నో అనుకుంటాం, టైం వచ్చినప్పుడు తప్పదు మరి'' అని మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్‌లో ఓ వీడియోని పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో బ్యాచిలర్ హీరోలందరూ కలిసి ఉన్న 'సింగిల్ ఆర్మీ' అనే వాట్సాప్ గ్రూప్ నుంచి నిఖిల్‌, నితిన్‌, రానా.. ఇలా ఒక్కొక్కరు లెఫ్ట్ అయ్యారు. చివర్లో "ప్రభాస్ అన్నా.. సారీ, ఇప్పుడు నా వంతు వచ్చిందంటూ" సుప్రీం హీరో కూడా లెఫ్ట్ అయ్యారు. దీంతో సాయి తేజ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని అభిమానులు భావించారు.

తాజాగా అసలు విషయాన్ని బయటపెట్టాడు సాయి ధరమ్. తను నటిస్తున్న తాజా చిత్రం సోలో బ్రతుకు సో బెటర్ మూవీ ప్రమోషన్‌లో భాగంగా వీడియో షేర్ చేసినట్టు అర్థమైంది. చిత్రం నుండి నో పెళ్ళి అనే సాంగ్ ఇప్పటికే విడుదల కాగా, దీనికి సూపర్భ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు హే ఇది నేనేనా అనే మరో సాంగ్ 26 ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నారు. మొన్నటి వరకు నో పెళ్ళి అన్న విరాట్‌కి అమృతని చూసాక ఏమైంది అని తెలియాలంటే ఆ సాంగ్ వినాల్సిందేనని మెగా హీరో అంటున్నాడు.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. బివిఎస్‌యెన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మే 1వ తేదీన విడుదల కావాల్సిన ఈ మూవీ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. థియేటర్స్ రీ ఓపెన్ కాగానే ఈ సినిమాను విడుదల చేయనున్నారుదీనిపై మరింత చదవండి :