151వ సినిమాలో చిరంజీవి చనిపోతాడా..? క్లైమాక్స్ ఎలా ఉంటుంది?
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా తర్వాత చిరు తన 151వ సినిమాను కూడా లైన్‌లో పెట్టేశారు. చిరు ఎప్పుడో తన 151వ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఆ బాధ్యతలు కూడా పూర్తిగా అరవింద్‌కే
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా తర్వాత చిరు తన 151వ సినిమాను కూడా లైన్‌లో పెట్టేశారు. చిరు ఎప్పుడో తన 151వ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఆ బాధ్యతలు కూడా పూర్తిగా అరవింద్‌కే అప్పగించారు. ఇక టాలీవుడ్ లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఈ సినిమాకు దర్శకుడు కూడా ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి మరణిస్తారని ఫిలిమ్ నగర్‌లో వార్తలొస్తున్నాయి.
చిరంజీవి కొత్తగా చెయ్యబోయే 151 సినిమా కోసం అనుకుంటున్న ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి లో చిరు క్లైమాక్స్‌లో చనిపోవాల్సి ఉంది. ఇది చారిత్రక కథాంశం కావడంతో.. ఇష్టం వచ్చినట్లు మార్చుకునే అవకాశం ఉండదు. చివర్లో ఆ స్వాతంత్ర్య సమరయోధుడిని బ్రిటిషర్లు ఉరి తీసినట్లుగా చూపించాల్సి వస్తుంది.
మరి ఆన్ స్క్రీన్ మీద చనిపోయే సీన్‌లకి చాలా దూరంగా ఉండే చిరంజీవి ఇలాంటి సీన్ తీస్తారా లేక ఉయ్యాలా వాడ నరసింహా రెడ్డిని బ్రిటీషర్లు ఉరి తీశారు. అలా ఈ చిత్రంలో స్నేహం కోసం సీనియర్ చిరు చనిపోతాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. మరి 151వ సినిమాలో చిరంజీవి మరణం ఉంటుందో లేదో వేచి చూడాలి.