మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 9 అక్టోబరు 2018 (11:24 IST)

మద్యం తాగించి మరీ రేప్ చేశాడు... బాలీవుడ్ నటుడిపై నటి ఆరోపణలు

బాలీవుడ్ బుల్లితెర నటుడు అలోక్ నాథ్‌పై బాలీవుడ్ రచయిత, నిర్మాత, నటి వింటా నందా సంచలన ఆరోపణలు చేసింది. అత్యంత సంస్కారవంతుడుగా పేరొందిన వ్యక్తి తనతో బలవంతంగా మద్యం తాగించిమరీ రేప్ చేశాడని ఆరోపించింది.
 
ప్రస్తుతం బాలీవుడ్‌లో మీటూ ప్రకంపనలు కొనసాగుతున్న విషయం తెల్సిందే. సినీ, మీడియా రంగాల్లో వరసగా ఒక్కొక్కరు తమ భయంకరమైన అనుభవాలను సోషల్‌మీడియా వేదికగా వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈ కోవలోనే ప్రముఖ రచయిత, ప్రొడ్యూసర్‌ వింటా నందా తన అనుభవాన్ని షేర్ చేసింది. 
 
19 ఏళ్లుగా నేను ఈ సమయం కోసం వేచి చూస్తున్నాను అంటూ ఫేస్‌బుక్‌లో భయంకరమైన విషయాలను వెల్లడించారు. అలోక్‌నాథ్‌ తనపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించారు. తనతో బలవంతంగా మద్యం తాగించి మరీ అలోక్‌నాథ్‌  రేప్‌ చేశాడని 20 ఏళ్ల సంఘటనను వెల్లడించారు. 
 
అంతేకాదు 90వ దశకంలో టెలివిజన్ స్టార్‌గా వెలుగు వెలిగిన ఆయన అప్పటి టీవీ షో తారా (ఈ షో రచయిత, ప్రొడ్యూసర్‌ వింటా నందా) ప్రధాన నటిని కూడా లైంగికంగా వేధించాడనీ, దీనిపై ఫిర్యాదు చేసినందుకుగాను ఆమెను షో నుంచి తొలగించారన్నారు.
 
అయితే ఆ బాధనుంచి పూర్తిగా బయటలైంగిక వేధింపులపై ఫిర్యాదు చేస్తున్న బాధిత మహిళలను అభినందించిన వింటా ఇదే  సరైన సమయం మీరు ఎదుర్కొన్న వేధింపులపై గొంతెత్తి అరవండి. వేటగాడి చేతుల్లో చిక్కి బాధపడుతున్న బాధిత మహిళలందరూ మౌనాన్ని వీడాలని పిలుపునిచ్చారు.