బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: శుక్రవారం, 5 అక్టోబరు 2018 (20:08 IST)

దేవదాస్ హిట్ అయిందంటున్న నాగార్జున... వారు కూడా అలాగే...

దేవ‌దాస్ విడుద‌లైన‌పుడు ఇక్క‌డ లేను.. వారం రోజుల పాటు స‌ర‌దాగా కుటుంబంతో గ‌డిపాను అంటున్న నాగార్జున... ఇంకా ఏమన్నారంటే... 

నాగార్జున‌, నాని న‌టించిన దేవ‌దాస్ సినిమా విజ‌యవంతంగా రెండో వారంలోకి అడుగు పెట్టింది. ఈ సంద‌ర్భంగా చిత్ర హీరో నాగార్జున మీడియాతో మాట్లాడారు. ఆయ‌న మాట్లాడుతూ.. దేవ‌దాస్ విడుద‌లైన‌పుడు ఇక్క‌డ లేను.. వారం రోజుల పాటు స‌ర‌దాగా కుటుంబంతో గ‌డిపాను. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే.. తొలి వారంలో 41 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసి రెండో వారంలోకి అడుగుపెట్ట‌డం ఆనందంగా ఉంది. ఈ విషయంలో నానికి నేను థ్యాంక్స్ చెప్పాలి.. డాక్ట‌ర్ దాస్‌గా అద్భుతంగా న‌టించాడు. 
 
ఇప్పుడు ఆయ‌న వెకేష‌న్ ఎంజాయ్ చేస్తున్నాడు. ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య‌కు మంచి భ‌విష్య‌త్తు ఉంది. ఇక నిర్మాత అశ్వినీద‌త్ నేను ఆఖ‌రి పోరాటం సినిమా చేసిన‌పుడు ఎంత ప్యాష‌న్‌తో ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఈమ‌ధ్యే వైజ‌యంతి మూవీస్ 45 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఇక ఇప్పుడు ఆయ‌న‌కు కూతుళ్ళు పిల్ల‌ర్స్‌గా స‌పోర్ట్ ఇస్తున్నారు. అలాగే సినిమాటోగ్ర‌ఫ‌ర్ స్యామ్‌ద‌త్‌కు కూడా కృతజ్ఞ‌త‌లు. ఈ సినిమా ఇంత బాగా వ‌చ్చిందంటే ఆయ‌న కూడా ముఖ్య కార‌ణ‌మే. 
 
దేవాగా అత‌డు న‌న్ను చాలా బాగా చూపించాడు. మ‌ణిశ‌ర్మ గారు ఈ చిత్రానికి అద్భుత‌మైన సంగీతం అందించారు. అలాగే హీరోయిన్లు కూడా చాలా బాగా న‌టించారు. చివ‌ర‌గా మీడియాకు కూడా చాలా కృత‌జ్ఞ‌త‌లు. సెప్టెంబ‌ర్, అక్టోబ‌ర్ నాకు, నా కుటుంబానికి ఎప్పుడూ క‌లిసి వ‌స్తాయి. శివ సినిమా వ‌చ్చి అప్పుడే 29 ఏళ్లు గ‌డిచాయంటే ఇప్ప‌టికీ నాకు న‌మ్మ‌కం కుద‌ర‌డం లేదు. అలాగే అప్ప‌ట్లో నేను న‌టించిన నిన్నే పెళ్లాడ‌తా కూడా సంచ‌ల‌న విజ‌యం సాధించింది. దేవీ థియేట‌ర్లో అది కోటి రూపాయ‌లు వ‌సూలు చేసి రికార్డ్ సృష్టించింది.. అని చెప్పారు. 
 
నిర్మాత అశ్వినీద‌త్ మాట్లాడుతూ.. దేవ‌దాస్ విజయం చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాను. మా బ్యాన‌ర్లో ఎక్కువ సినిమాలు చేసిన నా హీరో నాగార్జున గారికి చాలా థ్యాంక్స్. టాలీవుడ్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎక్కువ మ‌ల్టీస్టార‌ర్స్ చేసారు. ఇప్పుడు నాగార్జున ఈ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. క‌ర్ణాట‌క ప్రేక్ష‌కుల‌కు కూడా ప్ర‌త్యేకంగా థ్యాంక్స్. అక్క‌డ 2.37 కోట్ల షేర్ వ‌చ్చింది. ఈ సినిమా కోసం నా స్నేహితులు నాని, శ్రీ‌రామ్ ఆదిత్య చాలా క‌ష్ట‌ప‌డ్డారు.. అని తెలిపారు. 
 
ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య మాట్లాడుతూ.. నాగార్జున గారి అభిమానుల నుంచి చాలా మంచి కాంప్లిమెంట్స్ వ‌స్తున్నాయి. నాగ్ స‌ర్, నాని,అశ్వినీద‌త్ మ‌రియు ప్రేక్ష‌కుల‌కు రుణ‌ప‌డిపోయాను.. అని తెలిపారు.