శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: గురువారం, 27 సెప్టెంబరు 2018 (10:09 IST)

మొన్న‌ టెన్ష‌న్ పెట్టాడు... నిన్న కూల్ అన్నాడు... నాగ్ మాట‌ల్లో మ‌ర్మం ఏమిటో.?

నాగార్జున - నాని క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్. యువ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన దేవ‌దాస్ సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పైన సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అశ్వ‌నీద

నాగార్జున - నాని క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్. యువ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన దేవ‌దాస్ సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పైన సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అశ్వ‌నీద‌త్ నిర్మించారు. ఈ మూవీ రిలీజ్ సంద‌ర్భంగా రెండు రోజుల ముందు ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్లో నాగార్జున మాట్లాడుతూ... ఈ సినిమా రిలీజ్‌కి రెండు రోజుల ముందు డైరెక్ట‌ర్ శ్రీరామ్ ఆదిత్య సినిమా చూపించాడు. రిలీజ్ డేట్‌కి ఒక నెల ముందు సినిమా చూపిస్తే.. మార్పులు చేర్పులు చేసుకోవ‌డానికి టైమ్ ఉంటుంద‌న్నారు.
 
నాగ్ ఇలా మాట్లాడ‌డంతో ఆయ‌న మార్పులు చేయాల‌నుకున్న‌ప్ప‌టికీ టైమ్ లేక చేయ‌లేక‌పోయాడ‌ని.. అంటే ఈ సినిమాపై అసంతృప్తి వుంద‌ని చెప్ప‌క‌నే చెప్పిన‌ట్టు అయ్యింది. నాగ్ మీడియా ముందు ఇలా మాట్లాడ‌టంతో అప్ప‌టివ‌ర‌కు ఈ సినిమాపై ఉన్న‌జోష్ కాస్త త‌గ్గింద‌నే టాక్ వినిపించింది. 
 
ఈ విష‌యం నాగ్ దృష్టికి వెళ్లిందో ఏమో కానీ... ఇప్పుడే నా కుటుంబంతో కలిసి దేవదాస్‌ చూశా. నా పాకెట్‌లో మరో విజయం ఉంది. ముఖంపై చిరునవ్వుతో హైదరాబాద్‌ నుంచి హాలిడేకు వెళ్తున్నా. లెజెండరీ వైజయంతి మూవీస్‌కు, అమేజింగ్‌ నానికి, యంగ్ టాలెంటెడ్ దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్యకు ధన్యవాదాలు అని నాగ్ ట్వీట్ చేశారు. మొన్న మాట‌ల‌తో టెన్ష‌న్ పెట్టాడు. నిన్న సినిమా చూసాను విజ‌యం ఖాయం అన్నాడు. నాగ్ మాట‌ల్లో మ‌ర్మం ఏమిటో?