ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (12:17 IST)

ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి జయంతి నేడు.. శ్రీవారి సుప్రభాతాన్ని పరిచయం చేసిన ఘనత..

ms subbulakshmi
కర్ణాటక సంగీత విధ్వాంసురాలు ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి జయంతి నేడు. శ్రీవారి సుప్రభాతాన్ని యావత్‌ ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఎంఎస్‌ సుబ్బులక్ష్మీదే. తిరుపతి పూర్ణకుంభం సర్కిల్‌లో ఆమె కాంస్య విగ్రహాన్ని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి ఆవిష్కరించారు. 
 
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్‌వద్ద, తరువాత హిందుస్థానీ సంగీతాన్ని పండిత్‌ నారాయణరావు వ్యాస్‌వద్ద శిక్షణ తీసుకున్నారు. 
 
పదేళ్ల వయస్సులో తిరుచిరాపల్లిలోని రాక్‌ఫోర్ట్‌ గుడిలోని వందస్తంభాల హాలులో తొలి సంగీత ప్రదర్శన ఇచ్చారు. మొత్తం పది భాషల్లో సుబ్బులక్ష్మి పాడారు. 
 
అయితే ఏభాషలో పాడినా.. అది తన మాతృభాషలో పాడినట్టుగా భాషానుడికారంతో భావయుక్తంగా ఆలపించడం మరో విశేషం. స్వాతంత్య్ర సమర యోధుడు, ఆనంద వికటన్‌ పత్రిక సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అయిన సదాశివన్‌ ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్నేళ్ల పాటు నాలుగు తమిళ సినిమాలు, వీటిలో మీరాబాయిని హిందీలో రీమేక్‌లోనూ నటించారు. ఆమె నటించినవన్నీ పౌరాణిక పాత్రలే.
 
తమిళనాడు రాష్ట్రం మదురైలో 1916 సెప్టెంబరు 16న న్యాయవాది సుబ్రమణ్య అయ్యర్‌, వీణా విద్వాంసురాలు షణ్ముఖ వడివూ అమ్మాళ్‌కు సుబ్బలక్ష్మి జన్మించారు. బాల్యంలోనే పాఠశాలకు వెళ్లడం మానేసిన ఆమె - అక్క, అన్నయ్యలతో కలిసి ఇంటివద్దే చదువు, సంగీతసాధన చేసేది. 
 
భారత సాంస్కతిక రాయబారిగా లండన్‌, న్యూయార్క్‌, కెనెడా, తూర్పుతీర దేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. 1997లో భర్త సదాశివం మరణం తరువాత బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం మానేశారు. 
 
సుబ్బులక్ష్మి గాత్ర మాధ్యుర్యానికి పరవశించిపోయిన నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సంగీత సామ్రాజ్ఞిగా కీర్తించగా, ఉస్తాద్‌ బడే గులాం అలీఖాన్‌ సుస్వర లక్ష్మిగా కొనియాడారు. 
 
సంగీత ప్రపంచంలో ఎన్నో అవార్డులు ఆమెను వచ్చి వరించాయి. 1998లో దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న ఇచ్చి ప్రభుత్వం తన గౌరవాన్ని చాటుకుంది.