ముంబై నటి జత్వానీ కేసు : ఐపీఎస్‌ల ముందస్తు బెయిల్ పిటిషన్లు
ముంబై నటి కాదంబరి జెత్వానీపై అక్రమంగా కేసు బనాయించి వేధించిన వ్యవహారంలో అరెస్టు చేయకాకుండా ఉండేందుకు ఐపీఎస్‌లు, ఏసీపీ, సీఐలు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేసుకున్నారు. వీటిపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇందులో పిటిషనర్ల తరపున వాదనలు ఆలకించిన కోర్టు.. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
ఈ పిటిషన్‌లపై ప్రభుత్వం అడ్వొకేట్ జనరల్ గురువారం వాదనలు వినిపించనున్నారు. మరో వైపు ఈ కేసులో రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ వైకాపా నేత కుక్కల విద్యాసాగర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా పడింది.
కాగా, కాదంబరి జెత్వానీ కేసు రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ కేసులో ఏపీ సీఐడీ విభాగం మాజీ అధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ నగర పూర్వ కమిషనర్ కాంతిరాణా టాటా, ఏసీపీ విశాల్ గున్నిలతో పాటు తదితరులు ఉన్నారు.