గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 7 మే 2023 (11:44 IST)

సమంత చాలా మంచి మనస్సున్న వ్యక్తి : నాగ చైతన్య

chai - sam
తమ మాజీ భార్య, సినీ నటి సమంత గురించి హీరో, మాజీ భర్త నాగ చైతన్య అక్కినేని తొలిసారి స్పందించారు. సమంత చాలా మంచి మనస్సున వ్యక్తి అంటూ చెప్పారు. ఆమె జీవితంలో ఎపుడూ సంతోషంగానే ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. తాను నటించిన కొత్త చిత్రం "కస్టడీ". ఈ నెల 12వ తేదీన విడుదలకానుంది. ఈ సందర్భంగా నాగ చైతన్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తామిద్దరం చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన వదంతుల వల్లే మా ఇద్దరి ఇబ్బందికర పరిస్థితులు మారాయని నాగ చైతన్య వివరించారు. ఒకరిపై ఒకరు గౌరవం లేనట్టుగా బయటి ప్రపంచంలో ప్రచారం జరిగిందని తెలిపారు. ఈ ప్రచారం తనను ఎంతగానే బాధించిందని తెలిపారు. 
 
ఈ వ్యాఖ్యలపై సమంత స్పందించారు. మనమంతా ఒక్కటే కేవలం అహంకారం, నమ్మకం, భయాలు మలన్ని దూరం చేస్తాయి అంటూ ఒక కొటేషన్‌ను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. సమంతపై నాగ చైతన్య ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం సామ్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.