మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (11:57 IST)

'మ‌హాన‌టి' సినిమాలో చైతు గెట‌ప్ ఎలా ఉంటుందో తెలుసా..?

అల‌నాటి న‌టి సావిత్రి జీవిత క‌థ‌తో రూపొందుతోన్న చిత్రం "మ‌హాన‌టి". ఈ సినిమాకి 'ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం' ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తోన్న 'మ‌హాన‌టి' షూటిం

అల‌నాటి న‌టి సావిత్రి జీవిత క‌థ‌తో రూపొందుతోన్న చిత్రం "మ‌హాన‌టి". ఈ సినిమాకి 'ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం' ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తోన్న 'మ‌హాన‌టి' షూటింగ్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది.
 
ఇటీవ‌ల 'మ‌హాన‌టి' టీజ‌ర్ రిలీజ్ చేశారు. కీర్తి సురేష్‌ని చూస్తుంటే... అచ్చు సావిత్రిని చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతోంది. దీంతో ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా..? అని ఆస‌క్తితో ఎదురుచూస్తున్నారు ప్రేక్ష‌కాభిమానులు.
 
 ఇదిలావుంటే... ఈ సినిమాలో అక్కినేని నాగ‌చైత‌న్య తాత అక్కినేని పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే... నాగ‌చైత‌న్య ఏ గెట‌ప్‌లో క‌నిపించ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది. 
 
తాజా స‌మాచారం ప్ర‌కారం... చైత‌న్య 'దేవ‌దాసు' పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. 'దేవ‌దాసు' అన‌గానే అంద‌రికీ ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేది అక్కినేని నాగేశ్వ‌ర‌రావు. ఎంత మంది దేవ‌దాసు పాత్ర‌లో న‌టించినా... దేవ‌దాసు అన‌గానే అంద‌రి మ‌దిలో మెదిలేది మాత్రం అక్కినేనే..! 
 
చైత‌న్య దేవ‌దాసు గెట‌ప్‌లో ఎలా ఉంటాడో..? అస‌లు చైతు దేవ‌దాసుగా ఎలా న‌టించాడో తెలియాలంటే మే 9వ తేదీ వరకు వేచివుండాల్సిందే. ఆ రోజున ఈ చిత్రం రిలీజకానుంది.