మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 12 జనవరి 2024 (18:15 IST)

రాజమౌళి సినిమా తర్వాతే మహేష్ బాబు తో సినిమా చేస్తా : నాగార్జున అక్కినేని

Nagarjuna Akkineni
Nagarjuna Akkineni
విజయ్ బిన్నీ ప్రాజెక్ట్ లోకి రాకముందే నా సామిరంగ లో నరేష్ పాత్రని అనుకున్నాం. సోదరభావం వున్న ఆ పాత్రకు నరేష్ కరెక్ట్ గా షూట్ అవుతారనిపించింది. అలాగే రాజ్ తరుణ్ ది కూడా కథలో కీలకమైన పాత్రే. నాన్న గారి పాట నుంచి వచ్చిన టైటిల్ ఇది. మన కథకు బాగా నప్పుతుందనిపించింది. సినిమాలో చాలా చోట్ల ఈ టైటిల్ వినిపిస్తూనే వుంటుంది అని నాగార్జున అక్కినేని అన్నారు.
 
విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రయానికి  ఎంఎం కీరవాణి అందించిన పాటలు చార్ట్ బస్టర్ గా అలరిస్తున్నాయి. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.  నా సామిరంగ సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కింగ్ నాగార్జున అక్కినేని  విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.
 
‘నా సామిరంగ’మీ కెరీర్ లో వేగంగా పూర్తి చేసుకున్న సినిమా అనుకోవచ్చా ?
షూటింగ్ డేట్ నుంచి మొదలుపెడితే రిలీజ్ డేట్ కి చిత్రీకరణ వేగంగా జరుపుకున్న సినిమా అనొచ్చు. వర్కింగ్ డేస్ లో మాత్రం కాదు. చాలా సినిమాలు 35రోజుల్లో చేశాం. ‘నా సామిరంగ’ 72 రోజుల చిత్రీకరణ చేశాం. నేను 60 రోజులు పని చేశాను. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా చేసుకుంటే.. ఇంత ఫాస్ట్ వర్క్ చేయడం సాధ్యపడుతుంది. ఈ చిత్రానికి చాలా మంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాం. కీరవాణి గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ వుండటం మా అదృష్టం. మూడు పాటలు షూటింగ్ కి ముందే ఇచ్చేశారు. అలానే ఫైట్ సీక్వెన్స్ కి కూడా నేపధ్య సంగీతం చేశారు. నేపధ్య సంగీతం పెట్టుకొని ఫైట్ షూట్ చేశాం. ఇంత ఫాస్ట్ గా, ఇంత పెద్ద స్కేల్ లో చేశామంటే దానికి కీరవాణి గారు ఒక కారణం. ఇందులో ప్రతి పాట అద్భుతంగా వుంటుంది. మా సినిమాకి కీరవాణి గారే స్టార్.  
 
 ‘నా సామిరంగ’ కథలో మిమ్మల్ని ఎట్రాక్ట్ చేసిన అంశాలు ఏమిటి ?
అన్ని ఎలిమెంట్స్ నచ్చాయి. మంచి స్నేహం, ప్రేమ, త్యాగం, విశ్వాసం.. ఇలా హ్యూమన్ ఎమోషన్స్ కూడిన చాలా అద్భుతమైన కథ ఇది.
 
తెలుగు తెరపై తొలిసారి సంక్రాంతి ప్రభల తీర్ధం నేపధ్యాన్ని తీసుకున్నారు కదా ?
భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజుల్లో జరిగే కథ ఇది.  మనకి సంక్రాంతిపెద్ద పండగ. ఇది 80 నేపధ్యంలో జరిగే కథ. ఇది పండక్కి అందరూ చూడాల్సిన సినిమా.
 
ఇది మలయాళీ మూలకథ. వారి కథలు, పాత్రలు  స్లోగా మొదలౌతాయి. తెలుగులో వచ్చేసరికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?
కథ సోల్ మిస్ అవ్వకుండా చేశాం. ఈ విషయంలో దర్శకుడు బిన్నీకి క్రెడిట్ ఇస్తాను. చాలా చక్కగా డిజైన్ చేశాడు. ప్రసన్న తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా చక్కగా మార్చాడు.
 
ఆషికా రంగనాథ్ గురించి ?
ఇందులో చాలా టిపికల్ లవ్ స్టొరీ వుంది. నేను కిష్టయ్య పాత్రలో కనిపిస్తాను. మా ఇద్దరి మధ్య 12 ఏళ్ళ నుంచి ఒక ప్రేమకథ నడుస్తుంది. ముఫ్ఫై ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ పరిచయమై మాట్లాడకుండానే వాళ్ళ ప్రేమకథ నడుస్తుంది. చాలా డిఫరెంట్ లవ్ స్టొరీ ఇది. ఆషికా చాలా చక్కగా నటించింది.  
 
దర్శకుడు విజయ్ బిన్నీ గురించి ?
విజయ్ కి చాలా మంచి విజువల్ సెన్స్ వుంది. తను కొరియోగ్రఫీ చేసిన పాటలు చూశాను. డ్యాన్స్ లా కాకుండా పాటలోనే మంచి కథని చెప్పే నేర్పు తనలో వుంది. అది నాకు చాలా నచ్చింది. ఇది కథ తనకి ఇచ్చి ఎలా చేస్తావని చెప్పమన్నప్పుడు.. తను అనుకున్న పద్దతిలో చెప్పాడు. అది మా అందరికీ నచ్చింది. బిన్నీ చాలా క్లారిటీ వున్న దర్శకుడు.
 
మహేష్ బాబు గారితో  కలసి సినిమా చేసి, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు లెగసి ని కొనసాగించాలని గతంలో ఓ ట్వీట్ చేశారు కదా .. ఆ సినిమా చర్చలు జరుగుతున్నాయా ?
ఆయన రాజమౌళి గారితో సినిమా పూర్తి చేసిన తర్వాతే దాని గురించి ఆలోచించాలి.
 
కొత్త సినిమా గురించి ?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాను.