శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (13:21 IST)

నాగార్జున 'శివ' ఈజ్ బ్యాక్... 28న స్పెషల్ షో

హీరో నాగార్జున్, డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "శివ". ఈ చిత్రం 1989 అక్టోబర్ 5వ తేదీన రిలీజైంది. అమల హీరోయిన్. అప్ప‌ట్లో ఈ చిత్రం రికార్డు క‌లెక్ష‌న్స్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర

హీరో నాగార్జున్, డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "శివ". ఈ చిత్రం 1989 అక్టోబర్ 5వ తేదీన రిలీజైంది. అమల హీరోయిన్. అప్ప‌ట్లో ఈ చిత్రం రికార్డు క‌లెక్ష‌న్స్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భంజ‌నం సృష్టించింది. ముఖ్యంగా ఈ చిత్రంలో నాగార్జున సైకిల్ చైన్ లాగ‌డం అప్ప‌ట్లో ఓ ట్రెండ్ సెట్ చేసింద‌నే చెప్ప‌ొచ్చు. విమ‌ర్శ‌కులు సైతం ఈ సినిమాని పొగ‌డ‌కుండా ఉండ‌లేక‌పోయారు. 
 
అలాంటి ఈ చిత్రాన్ని ఇప్పుడు మ‌రోసారి వెండితెర‌పై ప్ర‌ద‌ర్శించ‌నున్నార‌ట‌. ఫిబ్ర‌వ‌రి 18న హైద‌రాబాద్ పీవీఆర్‌లో 'శివ' సినిమా ప్ర‌ద‌ర్శ‌న జ‌రుపుకోనుండ‌గా, ఈ స్పెషల్ షోకు నాగార్జునతో పాటు అమల, దర్శకుడు వర్మ, నాగ్, వర్మ ఫ్యాన్స్ హాజరౌతున్నట్లు సమాచారం. ప్ర‌స్తుతం నాగ్‌, వ‌ర్మ కాంబినేష‌న్‌లో కాప్ డ్రామా తెర‌కెక్కుతుండ‌గా, ఈ సినిమా ప్ర‌మోష‌న్‌కి ఉప‌యోగ‌ప‌డేలా శివ సినిమా స్పెష‌ల్ షో ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తుంది.