ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 20 జూన్ 2019 (18:09 IST)

నాగశౌర్య‌కు దర్శకేంద్రుడి ప‌రామ‌ర్శ... మంచి కుర్రాడు...

యువ‌హీరో నాగశౌర్య ఇటీవల షూటింగ్‌లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. వైజాగ్‌లో షూటింగ్‌ చేస్తోన్న సమయంలో నాగ‌శౌర్య‌ డూప్ లేకుండా యాక్షన్ స్టంట్ చేస్తుండగా ప్రమాదశాత్తు ఆయన కాలికి గాయమైంది. గాయాన్ని ప‌రీక్షించిన డాక్ట‌ర్లు 15 రోజుల పాటు బెడ్ రెస్ట్ అవసరమని సూచించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. 
 
నాగశౌర్యకు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, ర‌చ‌యిత బి.వి.య‌స్.ర‌వి ఆయన్ని పరామర్శించారు. అనంతరం రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘నాగ‌శౌర్య చాలా మంచి కుర్రాడు. సినిమా కోసం చాలా క‌ష్టప‌డ‌తాడు. అలాంటి వాడికి యాక్సిడెంట్ అయిందని తెలియ‌గానే.. చాలా బాధ అనిపించింది. వెంట‌నే ఫోన్‌లో ప‌రామ‌ర్శించాను. 
 
అయిన‌ప్ప‌టికీ... మ‌న‌సు ఒప్పుకోక‌పోవ‌డంతో చూడాల‌నిపించి త‌న నివాసాని వ‌చ్చాను. దేవుని ద‌య‌ వల్ల త్వర‌గా కోలుకోవాల‌ని, షూటింగ్‌లో చురుకుగా పాల్గొనాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.ర‌చ‌యిత‌ బి.వి.యస్.రవి మాట్లాడుతూ.. ‘నాకు శౌర్య అంటే గౌర‌వం. ఇప్పుడున్న చాలా మంది యంగ్ హీరోల్లో శౌర్య ప్రత్యేక‌మైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. అలాంటి శౌర్యకి ఇలా జ‌ర‌గ‌టం చాలా బాధగా అనిపించింది. ఈరోజు త‌న నివాసంలో క‌లిసాం. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.