ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 31 ఆగస్టు 2024 (18:34 IST)

మాతృమూర్తి షాలిని చిరకాల స్వప్నాన్నినెరవేర్చిన ఎన్టీఆర్

Ntr, shalini, rishbsetty, prshant neel
Ntr, shalini, rishbsetty, prshant neel
ఈరోజు మంగుళూరు ఎయిర్ పోర్ట్ లో నందమూరి తారకరామారావు, కన్నడ స్టార్ కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి కలవడం తెలిసిందే. అయితే కొద్దిసేపటి క్రితమే తాను ఎందుకు ఇక్కడకు వచ్చిందో తెలియజేస్తూ తన తల్లితో దేవాలయాన్ని దర్శించుకున్న ఫొటోలను తారక్ పోస్ట్ చేశారు. ఉడిపి శ్రీ కృష్ణ మఠం, కుందాపూర్ ను సందర్శించడం ద్వారా మాస్ మ్యాన్ ఆఫ్ మాస్ తారక్ తన తల్లి షాలిని భాస్కరరావు చిరకాల స్వప్నాన్ని నెరవేర్చాడు..అని సోషల్ మీడియాలో ఆయన ప్రతినిధి పోస్ట్ చేశారు. 
 
తన కుటుంబం,  స్నేహితులతో అక్కడ ఉన్నందుకు అతను తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తారక్ తోపాటు రిషబ్ శెట్టి కూడా దేవాలయంలో వున్నారు. ఆయన ఆధ్వర్యంలో దర్శనం జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం అక్కడ కేజిఎఫ్. దర్శకుడు ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి, తారక్ లు అరటిఆకులో భోజనానికి కూర్చున్న ఫొటోను కూడా షేర్ చేసి అభిమానులను ఆనందపరిచారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ సినిమా కూడా భవిష్యత్ లో వుండనుంది.