సీరియల్స్‌కూ నంది అవార్డులు ఇవ్వాలి
సహజంగా కథల పోటీలకు వార పత్రికలో పోటీ పెడుతుంటారు. ఉత్తమ కథలు, రచనలు, కవితలకు మూడు భాగాలుగా బహుతి ప్రదానం చేస్తారు. ఆ క్రమంలో చాలా కాలం క్రితం ఫేమస్ వార ప్రతికలో చెత్త కథల పోటీ అనేది కూడా ఏర్పాటు చేశారు నిర్వాహకులు. అందులో చిత్ర విచిత్రమైన కథలు కూడా పోటీకి వచ్చాయి. అవి చదివాక కథలు ఇలాకూడా రాయవచ్చా! అని ఆశ్చర్యపడ్డారు పత్రికాధినేతలు. దానితో మళ్ళీ ఆ ప్రస్తావనకు ఫుల్‌స్టాప్ పెట్టారు. ఇలా ఎందుకు పెట్టారని ఓ పాఠకుడు అడిగితే, దీనికి స్పూర్తి విదేశాల్లో ఇటువంటి పోటీలు వుండడమే అని ఎడిటర్ సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు మన తెలుగు సీరియల్స్‌లోని కథలు కూడా అలాంటి పోటీలకు ధీటుగా వున్నాయి. ఒకవేళ అలాంటి పోటీ వుంటే ముందువరసలో చాలా సీరియల్స్ క్యూకడతాయనే విశ్లేషకులు తెలియజేస్తున్నారు.
ఎంపికైన ఉత్తమ కథ ఇదే!
చెత్తకథల పోటీలోల్లో మచ్చుకు ఒకటి చూద్దాం. ఒక నిరుద్యోగి ఉద్యోగం కోసం ఓ ఆఫీసుకు వెళతాడు. చాలామంది లైన్‌లో వుంటారు. కానీ షడెన్‌గా అతని పేరు పిలుస్తాడు బంట్రోతు. లోపలికి వెళతాడు నిరుద్యోగి.. ఏవో ప్రశ్నలు అడుగుతారు లోపలి జడ్జిలు. ఎలా వచ్చావంటే నడచుకుంటూ అని బదులిస్తాడు. బస్‌లో వస్తే సరిపోతుంది కదా అని ఓ వ్యక్తి అడుగుతాడు. జేబులో డబ్బులు లేవంటాడు నిరుద్యోగి. ఈలోగా ఓ ఫోన్ వస్తుంది. అమ్మకు బాగోలేదని ఫోన్‌లో అవతలి వ్యక్తి చెబుతాడు. వెంటనే అక్కడ నుంచి చెప్పాపెట్టకుండా నిరుద్యోగి బయటకు వస్తాడు. అతన్ని చూడగానే కారు డ్రైవర్ కారు తీసుకువస్తాడు. అది ఎక్కి నిరుద్యోగి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏవోవో సన్నివేశాలతో కథంతా నింపేశాడు రచయిత. దీనికి మొదటి ఫ్రైజ్ ఇస్తున్నట్లు చెత్త కథల పోటీ నిర్వాహకులు ప్రకటించారు.
ఇదంతా ఎందుకంటే, ఇప్పుడు తెలుగులో వస్తున్న సీరియల్స్ అచ్చం అలాగే వున్నాయి. చేతిలో పెన్ను,మైండ్‌లో ఏది తట్టితే అది రాయడం, దాన్ని సీన్‌గా మార్చేయడం రచయిత పనిగా మారింది. గత కొద్దిరోజులుగా టీవీల్లో ప్రసారమయ్యే ఏ సీరియల్ చూసినా ఇదేతంతు. దర్శకుల అవగాహనా రాహిత్యానికి నిదర్శనమో, టీవీ ఛానల్ నిర్వాహకుల అతి తెలివికి దర్పణమే తెలీయదు కానీ ప్రేక్షకులకు మాత్రం పెద్ద నరకంగా వుంది. అందుకే చాలామంది సీరియల్‌కు బదులు కామెడీ ఎపిసోడ్స్‌కు మళ్ళుతున్నారు.
ఇటీవలే ఓ ప్రముఖ ఛానల్‌లో ప్రసారమయ్యే సీరియల్‌లో నాయిక కోర్టుకు సాక్ష్యం చెప్పడానికి ఓ సాక్షిని ఆటోలో కోర్టుకు వస్తుంది. కోర్టు గేటుకు దగ్గరగా ఆటో దిగుతుంది. అప్పటికే ఆమె ప్రత్యర్థి ఈ సాక్షిని చంపేడాయిని ప్లాన్ వేస్తుంది. అసలు ఆటో నేరుగా గేటు వద్దే పోనియవచ్చు. కానీ దర్శకుడు వద్దన్నాడు అనుకుంట. సరే! ఇక వారు ఆటోదిగి లోపలకు వెళ్ళడానికి నడచుకుంటూ వస్తుండగా ఇద్దరు రౌడీలు వచ్చి అడ్డుకుంటారు. వారిని చూసి సాక్షి పరుగెడుతుంది. నాలుగు అడుగులు వేస్తే కోర్టు లోపలికి వెళ్ళవచ్చు. కానీ ఆమె అలా వెల్ళదు. వెనక్కు పరిగెడుతుంది. అలా చెట్లు, చేమలు పరుగెత్తాక, కారులో వచ్చిన రౌడీ ఆ సాక్షిని గుద్దేస్తాడు. ఆమె చనిపోతుంది. ఇదంతా ఎక్కడో బయట జరుగుతుంది. కానీ కట్‌చేస్తే, ఆ సీన్ కోర్టు గేటుదగ్గరకు మారుతుంది. అబ్బో.. కోర్టు గేటుముందు చంపేశారా! అంటూ చుట్టూ పోలీసులు, లాయర్లు ఆశ్చరర్యం వ్యక్తం చేస్తారు. మరి కోర్టు ముందు చంపితే ఎదురుగా వున్న పోలీసులు, లాయర్లు చూడలేదా? అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే, దర్శకుడు చూడొద్దన్నాడంటూ వెంటనే సీరియల్ చూసేవారు కామెంట్లు చేయాలిగదా.
ముసుగులో వారంరోజుల పెళ్లి
ఇక మరో సీరియల్‌లో మరింత డ్రామా వుంటుంది. రాజుగారింట్లో పెళ్లి. పెళ్లికొడుకు తను ప్రేమించిన అమ్మాయిని పెల్లి పీఠలమీద వరకు తీసుకువచ్చేలా కథ రాసుకున్నాడు దర్శకుడు. పెల్లి తంతు వారంరోజులపాటు చూపాడు. మెడలో తాళికూడా కట్టేస్తాడు. కానీ మొహం చూడడు. అదేమంటే. రాజుల ఆచారం. అంతరకు బాగానే వుంది. ఆ ముసుగులో మరో అమ్మాయి అతనితో వెళ్లిపోతుంది. మరి కాపురం ఎలా చేస్తాడో ఏమిటో అనేది అడక్కండి. ఎందుకంటే ఫేస్ చూడకుండా సీరియల్ ఎంతోకాలం సాగదీయాలిగదా.
ఇక మరో సీరియిల్‌లో అక్కాచెల్లుల్లు ఇద్దరూ ఒకే ఇంటిలో కోడల్ళు. కానీ అక్కంటే చెల్లికి పడదు. ఇలా ఇద్దరు ట్విన్స్. మొగుడిని బఫూన్‌లా అత్తగారిని పిచ్చిదానిలా చేస్తూ కాలక్షేపం కథలా వుంటుంది. అక్కాచెల్లులు చెప్పే డైలాగ్లు మాడ్యలేషన్ కూడా ఒకేలా వుంటుంది. చివరికి ఆ సీరియల్ అర్థంతరంగా ఆపేశారు. అప్పుడుకానీ చూసేవారు హమ్మయ్య! దరిద్రం వదిలిందిరా బాబూ అని ఊపిరి పీల్చుకున్నారు. దాని ప్లేస్‌లో మరో సీరియల్. వచ్చింది. ఇదికూడా సాగదీత. ఇలా ఒకటికాదు. ఏ ఛానల్ పెట్టినా, ఏ సీరియల్ చూసినా అన్నీ చెత్తకథలుగా వున్నాయి. వీటికి పోటీలు పెడితే అన్నింటికీ ప్రైజ్‌లు వస్తాయని వీక్షకులే కామెంట్ చేసుకోవడం విశేషం.
అదేదో సీనిమాలో బ్రహ్మానందం ఓ డైలాగ్ చెబుతాడు. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళానుకుంటాం. కానీ మీరు రారు. ఎందుకంటే మీరు అక్కడే వుండాలనుకుంటారు. సరిగ్గా ఈ డైలాగ్‌లు ప్రస్తుతం సీరియల్స్ కు యాప్ట్ అవుతాయి. మరి సీరియల్స్‌కూ నంది అవార్డులు ప్రకటిస్తేనే ఏమైనా మార్పు కనిపిస్తోందోమో చూడాలి. కాలం మారినా కథలు మారలేదనడానికి ఇదే రీజన్.