మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2019 (17:46 IST)

నాని కొత్త మల్టీస్టారర్ సినిమా... మరో హీరో ఎవరో తెలుసా?

నేచురల్‌ స్టార్‌ నాని ఇప్పుడు జెర్సీ చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న ఆనందంలో మునిగి తేలుతున్నాడు. మరోవైపు తన తదుపరి సినిమా విశేషాలను సోమవారం వెల్లడించాడు. నానిని వెండి తెరకు పరిచయం చేసిన మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయబోతున్నారు. 
 
నాని ఈ సినిమా లోగోను ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ఇందులో సుధీర్‌బాబు మరో కథానాయకుడిగా నటించనున్నట్లు తెలిపాడు. ఎరుపు రంగులో ‘v’ అని రాసున్న ఈ సినిమా లోగో ఆసక్తికరంగా ఉంది. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సినిమా నేపథ్యం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
 
మరోవైపు సుధీర్‌బాబు కూడా ఈ సినిమా గురించి ట్విటర్ వేదికగానే స్పందించాడు. ‘సినిమాలో ఉన్న ఎన్నో ట్విస్ట్‌లలో ఇది మొదటి ట్విస్ట్‌. వెల్‌కమ్‌ నాని. మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించబోయే ఈ చిత్రం నుంచి ఊహించలేని విషయాలు మీ ముందుకు రాబోతున్నాయి’ అని తెలియజేసాడు. అదితి రావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించనున్నారు.