సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2022 (15:54 IST)

జాతీయ పురస్కారాలే నా కోరిక - కోరియోగ్రాఫర్ బాబా బాస్కర్

Baba Baskar
Baba Baskar
కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హీరో కిరణ్ అబ్బవరం, సంజ‌న ఆనంద్‌, సిధ్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా బాస్క‌ర్‌,సోను ఠాగూర్, భరత్ రొంగలి నటీ నటులుగా యస్.ఆర్ కల్యాణ మండపం దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి రామ‌కృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న చిత్రం  “నేను మీకు బాగా కావాల్సినవాడిని”.ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సందర్బంగా ఈ చిత్రంలో  లీడ్ రోల్ లో నటించిన స్టార్ కోరియోగ్రాఫర్ బాబా బాస్కర్ పాత్రికేయులతో మాట్లాడుతూ
 
కోరియోగ్రాఫర్  , డ్యాన్సర్ , యాక్టర్...ఇలా ఏదైనా సరే నాకు సినిమానే జీవితం, సినిమానే నా డ్రీమ్. ఈ సినిమాలో  హీరోకి స్నేహితుడుగా కీలక పాత్రలో నటించాను. అయన తో పని చేయడం చాలా సులువుగా ఉంది. తను అందరితో బాగా కలసి పోతాడు.చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదె కు కథ  విషయంలో మంచి స్పష్టత ఉంది. ఈ సినిమా కొరకు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎంతో మందికి  లైఫ్ ఇచ్చిన కోడిరామకృష్ణ  బ్యానర్ లో నటించడం చాలా హ్యాపీ గా ఉంది
 
ఈ సినిమాలో నటిస్తూనే లాయర్ పాప సాంగ్ కు కోరియోగ్రఫీ చేశాను.ఈ పాట ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.. నాకు కోరియోగ్రఫీ, యాక్టింగ్ అనేవాటిని వేరుగా చూడకుండా .రెండు సేమ్ అని భావిస్తాను.అయితే నాకు ఎవరు ఏ అవకాశం ఇచ్చినా  చేస్తాను. చివరికి చిన్న క్యారెక్టర్ అయినా చెయ్యాలనే కోరిక ఉంది.
 
నేను ఒక సినిమా డైరెక్షన్ చేశాను. ఆ తరువాత  కూడా డైరెక్షన్ చేయాలని చాలా కథలు సెలెక్ట్ చేసుకొంటున్నాను. టైమ్ సెట్ అయితే వెంటనే సినిమా చేస్తాను. కోరియోగ్రాఫర్ గా రాష్ట్ర జాతీయ  పురస్కారాలు అందుకోవాలనేది  నా కోరిక  దానికోసం చాలా కష్టపడ్డాను ఇకపై కూడా కష్టపడతాను.
 
మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాను ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేలా ఉంటుంది.ఈ సినిమా తర్వాత తెలుగులో నీలకంఠం గారు చేసే సినిమాలో మంచి క్యారెక్టర్ లో చేస్తున్నాను. తమిళ్ లో ఒక సినిమాకు కోరియోగ్రఫీ  చేస్తున్నాను.ఈ నెల 16 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.