బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 15 జులై 2022 (17:34 IST)

కిరణ్ అబ్బవరం మీటర్ ఫస్ట్‌లుక్

Kiran Abbavaram
Kiran Abbavaram
డిఫరెంట్ చిత్రాలతో కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం మీటర్. రమేష్ కాదూరి దర్శకుడు. ప్రముఖ నిర్మాణ సంస్థలు క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీమూవీ మేకర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. 
 
శుక్రవారం కథానాయకుడి పుట్టినరోజు సందర్భంగా మీటర్ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను కూడా  విడుదల చేసింది చిత్రబృందం. ఈ ఫస్ట్‌లుక్‌లో కలర్‌ఫుల్ షర్ట్‌తో.. ఫుల్‌మాసివ్ లుక్‌తో కనిపిస్తున్నాడు కథానాయకుడు కిరణ్. ఈ లుక్‌తో పాటు టైటిల్ కూడా అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది. మోషన్‌పోస్టర్‌కు సాయి కార్తీక్ అందించిన మాసివ్ బ్యాగ్రౌండ్ స్కోర్ చూస్తుంటే ఇది పక్కా కమర్షియల్ పైసా వసూల్ చిత్రంగా అనిపిస్తుంది. 
 
ఈ చిత్రం కిరణ్ అబ్బవరం ఇమేజ్‌ను రెట్టింపు చేసే విధంగా వుంటుందని చెబుతుంది చిత్రబృందం. అత్యులరవి నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సంభాషణలు: రమేష్ కాదూరి, సూర్య, డీఓపీ: వెంకట్.సి.దిలీప్, ప్రొడక్షన్ డిజైనర్: జేవీ, లైన్ ప్రొడ్యూసర్: అలేఖ్య పెదమల్లు,  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బాబాసాయి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కెవీవీ, ప్రొడక్షన్ కంట్రోలర్: సురేష్ కందుల, మార్కెటింగ్: ఫస్ట్‌షో, పీఆర్‌ఓ: వంశీ శేఖర్, మడూరి మధు