ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 21 ఆగస్టు 2017 (09:47 IST)

నవదీప్‌తో జూనియర్ ఎన్టీఆర్.. ఐదు నిమిషాలే టైమ్ బ్యాగు సర్దుకో.. ముమైత్ బూతులు..?

తెలుగు బిగ్ బాస్ షోతో మాకు రేటింగ్ అదిరిపోతుంది. బిగ్ బాస్ రియాలిటీ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. కంటెస్టెంట్ నవదీప్‌ను ఆటపట్టించారు. ఆదివారం ఎపిసోడ్ ఎలిమినేషన్ స్పెషల్ కావడంతో..

తెలుగు బిగ్ బాస్ షోతో మాకు రేటింగ్ అదిరిపోతుంది. బిగ్ బాస్ రియాలిటీ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. కంటెస్టెంట్ నవదీప్‌ను ఆటపట్టించారు. ఆదివారం ఎపిసోడ్ ఎలిమినేషన్ స్పెషల్ కావడంతో.. ఎన్టీఆర్ నవదీప్‌కు చెమటలు పట్టించారు. 
 
''నవదీప్ మీ ఇంట్లో ఐదొందలు, వెయ్యి రూపాయల పాత నోట్లు దొరికాయట. విచారణకు రమ్మని పిలుపొచ్చింది. ఐదు నిమిషాలే టైమ్ ఇస్తున్నాను. వెంటనే బయటకు రా.. బ్యాగు సర్దుకో..!" అంటూ హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్, నవదీప్‌కు సూచించారు. 
 
అంతే ఎన్టీఆర్ చెప్తున్నది నిజమేనని నమ్మిన నవదీప్ తన బ్యాగేజ్ సర్దుకునేందుకు వెళ్లగా, వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లి.. కొత్త వెయ్యి రూపాయల నోట్లు వచ్చాయని అందరినీ ఆటపట్టించగా.. మేము నిన్ను ఆటపట్టించలేమా?.. అన్నారు. దీంతో నవదీప్ ఊపిరిపీల్చుకున్నాడు. అందరూ నవ్వేశారు.
 
మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రసారం అవుతున్న 'బిగ్ బాస్' రియాల్టీ షో శనివారం మరింత రసవత్తరంగా సాగింది. షోను హోస్ట్ చేస్తున్న ఎన్టీఆర్ ఇంటి సభ్యులతో కుర్చీలాట ఆడించారు. అనంతరం కామెడీ స్కిట్లు చేయించారు. డిఫరెంటుగా సాగిన ఈ ఆట, కామెడీ స్కిట్లు ప్రేక్షకులను బాగా నవ్వించాయి. 
 
కుర్చీలాటలో అర్చన గెలిచింది. దీంతో బిగ్ బాస్ ఆమెకు బిర్యానీ గిఫ్టుగా ఇచ్చాడు. దాన్ని ముగ్గురితో మాత్రమే పంచుకోవాలని నిబంధన విధించగా, ముమైత్, హరితేజ, నవదీప్‌లతో బిర్యానీ షేర్ చేసుకుంది. ఈ స్కిట్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే ఎగ్ టాస్క్ కూడా అదరగొట్టింది. అయితే ఈ టాస్క్ కాస్త శ్రుతి మించింది. 
 
కెప్టెన్సీ పోటీలో భాగంగా ముమైత్, నవదీప్‌లకు రెండు ఎగ్స్ ఉన్న బౌల్స్ ఇచ్చారు. ఒకటీం, మరొక టీం ఎగ్స్ పగలగొట్టే ప్రయత్నం చేయాలి. చివరకు ఎవరి వద్ద ఎక్కువ ఎగ్స్ మిగిలితే వారే కెప్టెన్. తన ఎగ్స్ కాపాడుకోవడానికి నవదీప్ బాత్రూంలో వెళ్లి దాక్కున్నాడు. ఆ తర్వాత నవదీప్ టీం సభ్యులు ముమైత్ ఖాన్ ఎగ్స్ పగలగొట్టే ప్రయత్నం చేసే క్రమంలో కాస్త ఓవరాక్షన్ చేశారు. 
 
దీంతో ముమైత్‌కు కోపం వచ్చింది. నవదీప్ టీమ్‌ను ముమైత్ బూతులు తిట్టింది. అయితే ఆ బూతులు ప్రేక్షకులకు వినిపించకుండా సెన్సార్ కట్ చేశారు. శనివారం జరిగిన హోస్ట్ షోలో ఎన్టీఆర్ ముమైత్ బూతులు తిట్టిన విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. మొత్తానికి ఎలాగో అలా టాస్క్ గెలిచి ఇంటి కొత్త కెప్టెన్‍‌గా నవదీప్ బాధ్యతలు చేపట్టాడు.