శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2019 (19:12 IST)

ఈ ఏడాది కూడా నయనతారదే..

2019వ సంవత్సరంలోనూ లేడీ సూపర్‌స్టార్ హవా కొనసాగింది. తనదైన నటనతో లేడీ సూపర్‌స్టార్‌‌ స్థాయి వరకు ఎదిగిన నయనతార 2019వ సంవత్సరంలోనూ అగ్రస్థానంలో నిలిచింది. ఈ బ్యూటీ నటించిన ‘విశ్వాసం’, ‘ఐరా’, ‘మిస్టర్‌ లోకల్‌’, ‘కొలైయుదిర్‌ కాలం’, ‘బిగిల్‌’ వంటి చిత్రాలు ఈ ఏడాదిలోనే విడుదలై ఆవిడ అగ్ర స్థానాన్ని పదిలం చేసాయి. 
 
ఇక రెండో స్థానం విషయానికి వస్తే... నేటి అందాలతారల కంటే మునుపటి తార జ్యోతిక మూడు సినిమాలతో ఆ స్థానాన్ని దక్కించుకుంది. ‘రాక్షసి’, ‘జాక్‌పాట్‌’ చిత్రాల్లో సోలో హీరోయిన్‌గా మెప్పించిన ఆమె.. ఏడాది చివరలో వచ్చిన ‘తంబి’లో సోదరిగా నటించి ప్రశంసలందుకుంది. ఇక 2018వ సంవత్సరంలో ఐదు సినిమాలతో టాప్‌లో నిలిచిన కీర్తిసురేష్‌ ఈ ఏడాది ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. అయితే ‘మహానటి’కి జాతీయ అవార్డు దక్కడంతో మరే హీరోయిన్‌కూ దక్కని ఘనతను సొంతం చేసుకుంది.
 
ఇక ‘ఆడై’లో నగ్నంగా నటించి అమలాపాల్‌, ‘90ఎంఎల్‌’లో బోల్డుగా నటించిన ఓవియాలు సంచలనం రేపారు. అందాలతారలు త్రిష, హన్సిక ఒక్కో చిత్రంతోనే సరిపెట్టుకున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ‘కన్నే కలైమానే’, ‘పెట్రోమాక్స్‌’, ‘దేవి2’, ‘యాక్షన్‌’తో నాలుగు చిత్రాల్లోనూ, మేఘా ఆకాష్‌, కేథరిన్‌ థెరిసా, ఐశ్వర్య రాజేష్‌ మూడేసి చిత్రాల్లోనూ కనిపించినా ఆశించిన మేరకు విజయాలు సాధించలేకపోయారనేది బాక్సాఫీస్ టాక్. మరి వచ్చే ఏడాది కూడా నయనతార హవా కొనసాగుతుందా... మరెవరైనా ముందుకు వస్తారా.. వేచి చూద్దాం...