మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 10 డిశెంబరు 2019 (22:38 IST)

నరసాపురం ఎంపీ కృష్ణంరాజు రూ.1000 కిళ్లీ తినేందుకు మోదీ వస్తారా?

నరసాపురం పార్లమెంట్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు భారతీయ జనతా పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆయన ఏర్పాటు చేస్తున్న విందు హీట్ పెంచుతుంది. ఈ నెల 11వ తేదీన ఢిల్లీలో భారీ ఎత్తున ఓ పార్టీని ఇస్తున్నారు రఘురామ కృష్ణంరాజు. ఈ పార్టీకి దాదాపుగా మూడువేల మంది వీవీఐపిలు, వీఐపీలు హాజరవుతున్నారు.
 
ఈ విందులో ప్రధాని మోడీ, అమిత్ షాతో పాటు, భాజపా అగ్ర నేతలు వివిధ పార్టీల నేతలు, సినీ తారలు హాజరవుతున్నారు. దాదాపు 100 రకాల వంటకాలు విందులో రుచి చూపించబోతున్నాయి. గోదావరి రుచులు ఈ విందులో ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. భోజనాలు మాట పక్కన పెడితే 
ఈ విందులో మరో స్పెషల్ కిళ్ళీది.
 
ఈ కిళ్ళీ ఖరీదు రూ. 1000 అట. ఈ స్థాయిలో ఉన్న కిళ్ళీ ఎలా ఉండబోతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ రఘురామ కృష్ణంరాజు ఈ పార్టీ ఎందుకు ఇస్తున్నారు. వైసీపీ ఎంపీలు ఈ విందుకు వస్తారా అన్న విషయం క్లారిటీ లేదు.