సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Updated : మంగళవారం, 24 డిశెంబరు 2019 (13:34 IST)

నయనతారలో ఉన్నట్లుండి ఎందుకింత మార్పు..?

మూడున్నర దశాబ్థాల వయస్సుకు చేరినా నయనతార అందాలు మాత్రం సడలలేదు. ఓ ఇమేజ్ తో దూసుకుపోతున్న నయనతారకు భారీ చిత్రాల ఆఫర్లు వెన్నంటుతూనే ఉన్నాయి. సైరాలో నటించింది. రజినీకాంత్ దర్బార్ సినిమాలోను నటించింది. 

తమిళ చిత్రాలు చేస్తోంది. సోలోగా చేయాలన్నా, పెద్ద హీరోల సరసన నటించాలన్నా తనకు తనే సాటి అన్నట్లు సాగుతూ ఈ మధ్య మరింతగా పారితోషికాన్ని పెంచేసిందట. ఇంతముందు కూడా ఒకటి, రెండూ కాదు ఏకంగా ఒక్కో సినిమాకు ఐదు కోట్ల రూపాయలు పారితోషికాన్ని తీసుకుందట నయనతార.

అయితే అదే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు ఇంకా పెంచేసిందన్నది కోలీవుడ్ టాక్. అయినా సరే ఆఫర్ల హవా మాత్రం ఆమెకు ఏ మాత్రం తగ్గడం లేదంటున్నారు సినీవిశ్లేషకులు. ప్రస్తుతం నయనతార చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయట.