గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 16 డిశెంబరు 2019 (13:46 IST)

పింక్ రీమేక్ కోసం ప‌వ‌న్ కళ్యాణ్‌కి 50 కోట్లు ఇస్తున్నారా..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌కు గుడ్ బై చెప్పి రాజ‌కీయాల్లోకి వెళ్లిన త‌ర్వాత‌... మ‌ళ్లీ సినిమాల్లోకి రావాల‌ని అభిమానులు కోరుకుంటున్న విష‌యం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సైతం త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని మ‌ళ్లీ సినిమాల్లోకి రావాల‌ని కోరుకుంటూ త‌న మ‌న‌సులో మాటను చాలాసార్లు బ‌య‌ట‌పెట్టారు. ఇలా.. అన్న‌య్య చిరంజీవి, అభిమానులు సినిమాల్లో న‌టించాల‌ని ఒత్తిడి చేయ‌డంతో ప‌వ‌న్ మ‌న‌సు మార్చుకుని సినిమాలు చేయడానికి ఓకే చెప్పారు.
 
ప‌వ‌న్ రీ-ఎంట్రీ మూవీని అభిరుచి గ‌ల నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. బాలీవుడ్, కోలీవుడ్‌లో స‌క్స‌ెస్ అయిన పింక్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో ప‌వ‌న్ న‌టించేందుకు గాను రెమ్యూన‌రేష‌న్ 50 కోట్లు ఇస్తున్నార‌ట‌. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది. అజ్ఞాత‌వాసి ప్లాప్ అయితే 50 కోట్లు కూడా వ‌సూలు చేయ‌లేదు. అలాంటిది దిల్ రాజు ఏ నమ్మ‌కంతో ప‌వ‌న్‌కి 50 కోట్లు రెమ్యూన‌రేష‌న్ ఇస్తున్నారు అనేది ఆస‌క్తిగా మారింది.
 
ప‌వ‌న్‌కి 50 కోట్లు రెమ్యూన‌రేషన్ ఇచ్చి.. టోట‌ల్ సినిమాని 70 కోట్ల‌లో కంప్లీట్ చేయాల‌ని ప‌క్కా ప్లాన్ రెడీ చేస్తున్నార‌ట‌. నివేదా థామ‌స్, అంజ‌లి, అన‌న్యల‌ను ఎంపిక చేసార‌ట‌. వీరు కీల‌క పాత్ర‌లు. ప‌వ‌న్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్స్ వీళ్లు కాదు. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీని అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.