మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 23 మార్చి 2017 (09:48 IST)

నయనతార 'డోరా' చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి చూడలేరట...

హీరోయిన్ నయనతార నటిస్తున్న 'డోరా' చిత్రాన్ని ఫ్యామిలీ సభ్యులతో కలిసి చూడలేరట. అందుకే ఆ చిత్రానికి 'ఏ' సర్టిఫికేట్ మంజూరు చేశారు. దీంతో చిత్ర యూనిట్ దిగ్భ్రాంతికి గురైంది.

హీరోయిన్ నయనతార నటిస్తున్న 'డోరా' చిత్రాన్ని ఫ్యామిలీ సభ్యులతో కలిసి చూడలేరట. అందుకే ఆ చిత్రానికి 'ఏ' సర్టిఫికేట్ మంజూరు చేశారు. దీంతో చిత్ర యూనిట్ దిగ్భ్రాంతికి గురైంది. నయనతార నటిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్‌ హర్రర్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి హితేష్‌ జబక్‌, దర్శకుడు సర్గుణం సంయుక్త నిర్మాణంలో యువ దర్శకుడు దాస్‌ రామస్వామి తెరకెక్కించారు. 
 
ఈ చిత్రంపై మొదటి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఫస్ట్‌లుక్‌, టీజర్‌, ట్రైలర్ల తర్వాత అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. నయనతార డీగ్లామర్‌ రోల్‌లో నటించినా ఈ సినిమా కోసం యూత్ కూడా ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తోంది. 
 
ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని వచ్చే 31వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ‘డోరా’కి సెన్సార్‌ బోర్డు ఏ సర్టిఫికెట్‌ ఇవ్వడంతో అంతా తారుమారైంది. సినిమాలో హర్రర్‌ కంటెంట్‌ అధికంగా ఉన్నందువల్లే ఏ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.