నయనతో ఇప్పుడే పెళ్లి నో.. కెరీర్‌పై దృష్టి పెట్టాం.. విఘ్నేశ్ శివన్ (video)

Nayan_Vicky
Nayan_Vicky
సెల్వి| Last Updated: సోమవారం, 31 ఆగస్టు 2020 (19:32 IST)
దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతార, ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ వివాహం త్వరలోనే జరుగనుంది. కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. వీరిద్దరూ ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారని.. త్వరలోనే వీరిద్దరూ వివాహం ద్వారా ఒకటి కానున్నారని కోలీవుడ్ కోడై కూస్తోంది. సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార.. శింబు, ప్రభుదేవాలకు బ్రేకప్ చెప్పిన తర్వాత దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే.

ఈ జంట తరచు చెట్టాపట్టాలు వేయడం, టూర్స్‌కి వెళ్లడం, పార్టీలలో సందడి చేయడం చూసిన అభిమానులు త్వరలో పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమని అందరూ అనుకున్నారు. తాజాగా ఈ పెళ్లి వార్తలపై విఘ్నేశ్ శివన్ స్పందించాడు.

''మా పెళ్లి గురించి అందరు అడుగుతున్నారు. త్వరలో పెళ్లి అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇందులో నిజం లేదు. ప్రస్తుతం కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టాం. కొన్ని గోల్స్ పెట్టుకున్నాం. పెళ్లి తర్వాత వాటిని సాధించడం కంటే ముందే సాధిస్తే బాగుంటుందని ఇద్దరం భావించాం. అందుకే పెళ్లి గురించి ప్రస్తుతం ఆలోచించడం లేదు. ప్రియుడిగా ఆమె నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉంది. అలాగే, నాకు కూడా కొన్ని కలలు ఉన్నాయి. అవి కూడా జరగాలి'' అని చెప్పుకొచ్చాడు.

ఇకపోతే.. ఈ రోజు ఓనమ్ పండగ సందర్భంగా తన ప్రియుడితో కలిసి కొచ్చిలో అడుగుపెట్టింది. కేరళీయుల ముఖ్య పండుగ ఓనమ్‌ను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు నయన్ చెన్నై నుండి చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసుకుని మరీ కొచ్చి వచ్చింది. ఈ సందర్భంగా ఫ్లైట్ దిగుతున్న కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ ఫోటోల్లో స్టైలిష్ లుక్‌లో కనిపిస్తోంది. ఇక ఏళ్లుగా నడుస్తూ ఉన్న ఈ వీరి ప్రేమ కథకు శుభం కార్డ్ పడనుంది. త్వరలోనే ఈ జోడీ వివాహం చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.


దీనిపై మరింత చదవండి :