వన్‌ప్లస్ నుంచి బడ్జెట్ ఫోన్.. ధర రూ.10వేల లోపు వుండొచ్చు..
వన్‌ప్లస్ నుంచి బడ్జెట్ ఫోన్ భారత మార్కెట్లోకి విడుదల కానుంది. మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్లపై ప్రస్తుతం వన్ ప్లస్ దృష్టి పెట్టింది. త్వరలోనే వీటిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. దీని ధర కూడా రూ.10వేల లోపు ఉండొచ్చని సమాచారం.
ఇప్పటికే నార్డ్ సిరీస్‌లో 'వన్‌ప్లస్ నార్డ్ లైట్' తీసుకొచ్చేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. దాని ధర ఎంత ఉంటుందనేది సంస్థ ఇంకా వెల్లడించలేదు. అలాగే స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్‌తో బడ్జెట్ వన్‌ప్లస్ ఫోన్ బేస్ మోడల్‌ను రూ.9,999కే అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం.
బడ్జెట్ ఫోన్ ఫీచర్స్
* రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
* ట్రిపుల్ రేర్ కెమెరా, 13 మెగాపిక్సల్ ప్రైమరీ సెన్సర్
* బ్యాటరీ: 6000 ఎంఏహెచ్
* స్నాప్‌డ్రాగన్ 460 ఎస్‌వోసీ
* 6.52 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
* స్క్రీన్ రిసొల్యూషన్: 720X1,560 పిక్సెల్స్
* 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్