శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : సోమవారం, 25 మార్చి 2019 (18:35 IST)

రాధా రవికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన లేడీ సూపర్ స్టార్

హీరోయిన్ నయనతారపై తమిళ సినీ నటుడు రాధారవి అవమాన‌కరమైన కామెంట్స్‌ చేశారు. ఈ వ్యాఖ్యలకు నయనతార దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. పైగా ఈ అంశంపై తనకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి వ్యాఖ్యలు చేస్తే స్పందించాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొంది.
 
ముందుగా డీఎంకె నేత ఎంకె స్టాలిన్‌కు థాంక్స్ చెప్తూ తన స్టేట్‌మెంట్‌ను మొదలుపెట్టిన నయనతార ‘స్త్రీలను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన రాధారవి వంటిటి వ్యక్తులపై వెంటనే యాక్షన్ తీసుకున్నందుకు నా సిన్సియర్ థాంక్స్.' అని చెప్పారు. 
 
ఇక రాధా రవి గురించి మాట్లాడుతూ... నీవు కూడా ఒక తల్లికే పుట్టావు. కానీ మీలాంటి వ్యక్తులు మహిళలను చిన్నచూపు చూడటం, తక్కువ చేసి మాట్లాడటం మగతనం అనుకుంటారు. ఇలాంటి వ్యక్తుల మధ్య బ్రతకాల్సి వస్తోంది అంటూ మండిపడ్డారు. ఇటువంటి వ్యక్తులు తమ పబ్లిసిటీ కోసం ఇలా మహిళల గురించి నీచంగా, తక్కువ చేసినట్లు మాట్లాడతారు అంటూ కాస్త ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. 
 
మహిళల గురించి ఇలా తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు మరికొంత మంది వ్యక్తులు చప్పట్లు కొడుతూ ప్రోత్సహించడం షాకింగ్‌గా ఉందంటూ పేర్కొన్నారు. ప్రజలు ప్రోత్సహిస్తున్నంత వరకు వీళ్లు ఇలాగే మహిళల గురించి నీచంగా మాట్లాడుతూనే ఉంటారని తెలిపారు. దేవుడి దయ వల్ల నాకు సినిమా రంగంలో మంచి అవకాశాలు వచ్చాయి. 
 
సీత, దెయ్యం, దేవత, స్నేహితురాలు, భార్య, లవర్, గర్ల్ ఫ్రెండ్ పాత్ర ఏదైనా సరే ప్రేక్షకులను మెప్పించడానికే చేస్తుంటాను అని నయనతార తెలిపారు. సుప్రీం కోర్టు సూచనల మేరకు విశాఖ గైడ్‌లైన్స్ ప్రకారం నడిగర్ సంఘంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేస్తారా? లేదా? అంటూ నయనతార ప్రశ్నించారు.