శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 డిశెంబరు 2023 (13:22 IST)

వివాదంలో అన్నపూర్ణి... నయనతార పెద్దగా పట్టించుకోలేదుగా..

లేడీ సూపర్‌స్టార్ నయనతార ఇటీవల తన 75వ చిత్రంగా ‘అన్నపూర్ణి – ది గాడెస్ ఆఫ్ ఫుడ్’తో గుర్తింపు పొందింది. జై, సత్యరాజ్, కెఎస్ రవికుమార్, తదితరులు కీలక పాత్రల్లో నికిలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రత్యేకంగా తమిళంలో విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది.
 
రాష్ట్రీయ హిందూ మహా సభ రాష్ట్ర అధ్యక్షుడు వేలు, ఈ సీన్స్ బ్రాహ్మణ సమాజాన్ని అవమానించాయని విమర్శించారు. ముఖ్యంగా ముస్లిం అబ్బాయి బ్రాహ్మణ యువతితో ప్రేమలో పడినట్లు చిత్రీకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సినిమాపై నిషేధం విధించాలని పిలుపునిచ్చారు. మిశ్రమ సమీక్షలను అందుకోవడంతో, ఈ చిత్రం ప్రత్యేకమైన కథాంశంతో దృష్టిని ఆకర్షించింది.
 
జీ స్టూడియోస్, నాట్ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నయనతార పాత్ర చుట్టూ తిరుగుతుంది, ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళ తన తండ్రి అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఉత్తమ భారతీయ చెఫ్‌గా మారాలని ఆకాంక్షిస్తుంది.
 
మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్‌లో నయనతార చురుగ్గా పాల్గొంటుండగా, ఈ వివాదంపై చిత్ర యూనిట్ నుంచి ఎవరూ ఇంకా స్పందించలేదు.