సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 10 డిశెంబరు 2020 (16:21 IST)

"నేడే విడుదల" సినిమా ప్రీ లుక్ విడుదల

"ఐకా ఫిల్మ్ ఫాక్టరీ" బ్యానరుపై అసిఫ్ ఖాన్, మౌర్యాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "నేడే విడుదల". ఈ సినిమా ద్వారా రామ్ రెడ్డి పన్నాల డైరెక్టరుగా పరిచయం అవుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనరుగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి చిత్ర యూనిట్ ఫ్రీ లుక్ విడుదల చేశారు. 
 
ఈ చిత్ర ప్రచారంలో భాగంగా యూనిట్ సభ్యులు ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియో ఆ సినిమా తాలూకా కొత్త ప్రచారాలకు నాంది పలికింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అతి తొందర్లో సినిమా ఫస్ట్ లుక్, పాటలను విడుదల చేస్తాం అని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు.
 
ఆసక్తికరమైన కథతో, ఆలోచింపచేసే కథనంతో, ఆహ్లదపరిచే సంభాషణలతో, విన్నూతనమైన ప్రచారంతో మన ముందుకు రానున్న ఈ "నేడే విడుదల" సినిమాలో మిగిలిన తారాగణంగా కాశీ విశ్వనాథ్, అప్పాజీ అంబరీషా, మాధవి, టిఎన్‌ఆర్, అదుర్స్ ఆనంద్, పీలా గంగాధర్, జబర్దస్ నవీన్, అశోక వర్ధన్, రసజ్ఞలు నటించారు. 
 
అలాగే, ఈ సినిమాకు సంగీతం అజయ్ అరసాడ, లిరిక్స్ శ్రీమణి, కెమెరా సి హిచ్ మోహన్ చారి, ఎడిటింగ్ సాయి బాబు తలారి, ఫైట్స్ అంజి, ఆర్ట్ డైరెక్టర్ సిహెచ్.రవి కుమార్, వి.ఎఫ్.ఎక్స్ : ఆర్ అంకోజీ రావు, నిర్మాతలు నజురుల్లా ఖాన్, మస్తాన్ ఖాన్, రచన దర్శకత్వం రామ్ రెడ్డి పన్నాల.