బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 4 మే 2018 (14:21 IST)

ప్రభాస్ అందర్నీ లవ్‌లో పడేస్తాడు.. నేషనల్ డార్లింగ్: నీల్ నితిన్

బాహుబలి సినిమా రిలీజ్‌కు తర్వాత ప్రభాస్ తన సహనటి అనుష్క శెట్టిని పెళ్లి చేసుకోనున్నాడని జోరుగా ప్రచారం సాగింది. అయితే తాము మంచి స్నేహితులం మాత్రమేనని.. మా మధ్య ప్రేమ లేదని ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. దీం

బాహుబలి సినిమా రిలీజ్‌కు తర్వాత ప్రభాస్ తన సహనటి అనుష్క శెట్టిని పెళ్లి చేసుకోనున్నాడని జోరుగా ప్రచారం సాగింది. అయితే తాము మంచి స్నేహితులం మాత్రమేనని.. మా మధ్య ప్రేమ లేదని ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. దీంతో ప్రభాస్ పెళ్లి విషయాన్ని పక్కనబెట్టిన సినీ ప్రేక్షకులు.. ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు. 
 
ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్.. ప్రభాస్ గురించి చెప్పుకొచ్చారు. ప్రభాస్‌ తన చుట్టూ ఉన్న వారిని తన ప్రేమలో పడేస్తాడని చెప్పారు. తన చుట్టూ వున్నవారితో ఆత్మీయంగా మాట్లాడటం.. తమ జర్నీ మొదలెట్టిన సమయంలో శుభాకాంక్షలు తెలపడం చేశారని.. ప్రభాస్ ప్రతి ఒక్కరిని వెంటనే ప్రేమలో పడేలా చేసేస్తారని సోషల్ మీడియాలో తెలిపారు. 
 
కాగా.. ప్రస్తుతం ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ''సాహో''. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్‌, ఎవ్లిన్‌ శర్మ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అమీ జాక్సన్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ, జాకీ ష్రాఫ్‌, చుంకీ పాండే ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అబుదాబిలో జరుగుతోంది.
 
కాగా సెట్‌లో ప్రభాస్‌తో కలిసి దిగిన ఫొటోలను నీల్‌ నితిన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. అందులో ఆయన సతీమణి, సోదరుడు, నటి ఎల్లిన్‌ శర్మ ఉన్నారు. దీంతో పాటు ప్రభాస్‌, సాహో, యాక్షన్‌ చిత్రం, సూపర్‌స్టార్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌లను కూడా జత చేశారు. త్వరలో తాను తండ్రిని కాబోతోన్నట్లు ఇటీవల నీల్‌నితిన్‌ చెప్పారు.